తీరొక్క చీరలో నేహా శెట్టి అందాల మెరుపులు.. పద్ధతిగానే కుర్ర గుండెల్ని కొల్లడుతున్న ‘రాధిక’..

First Published | Oct 27, 2023, 10:31 AM IST

‘డీజే టిల్లు’ చిత్రంతో నేహా శెట్టి ప్రేక్షకుల్లో ‘రాధిక’గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాత్రలో అంత అద్భుతంగా నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తోంది. 

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ నెట్టింట నిత్యం సందడి చేస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ చీరకట్టులోనే దర్శనమిస్తూ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది.

సరికొత్త చీరకట్టులో నేహా శెట్టి అందాల విందు చేస్తోంది. గ్లామర్ షోలో హద్దులు మీరకుండా నెటిజన్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తన అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది. వరుసగా శారీలో మెరుస్తూ మైమరిపిస్తోంది. 


తాజాగా బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. సొగసైన చీరలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. పద్ధతిగా కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. తన బ్యూటీఫుల్ ఫోజులతోనూ కట్టిపడేసింది. మత్తు కళ్లతో చూపుతిప్పుకోకుండా చేసింది.

అలాగే స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో మంత్రముగ్ధులను చేసింది. చీరకట్టి కుర్చీపై హాట్ సిట్టింగ్ పోజులతో అదరగొట్టింది. మత్తెక్కించే చూపులు, మతులుపోయే స్టిల్స్ తో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది.
 

సోషల్ మీడియాలో ఇలా నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తూ వస్తోంది. తన ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తూనే.. నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ దర్శక నిర్మాతలకూ తనను గుర్తుచేసుకుంటోంది. 
 

ప్రస్తుతం నేహా శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. రీసెంట్ గానే ‘రూల్స్ రంజన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు ‘బెదురులంక 2012’లో అలరించింది. నెక్ట్స్ విశ్వక్ సేన్ సరసన నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో అలరించబోతోంది.

Latest Videos

click me!