Stree Movie: 2018లో విడుదలైన హారర్-కామెడీ సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధించిన ఈమూవీకి ఓటీటీలో ఇప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకీ ఏంటా సినిమా?
ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. అంచనాలకు మించి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయి. సరిగ్గా ఇలాగే 2018లో వచ్చిన ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హారర్, కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా, రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇన్నేళ్లయినా ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఇంతకీ ఆ హారర్ సినిమా ఏదో తెలుసా? అదే 'స్త్రీ'.
24
బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు
'స్త్రీ' సినిమాలో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో విడుదలైన ఈ హారర్-కామెడీ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భయంతో వణికించింది. బాలీవుడ్‌లో 'స్త్రీ' భారీ కలెక్షన్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది. ఇక 'స్త్రీ' సినిమా కథ విషయానికొస్తే, మధ్యప్రదేశ్‌లోని చందేరి అనే ప్రాంతం నేపథ్యంలో ఈ కథను రాసుకున్నారు. ఆ ఊరిలో ఓ మహిళ ఆత్మగా మారి రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది.
34
విక్కీ పాత్రలో రాజ్‌కుమార్ రావ్
గ్రామస్థులు ఆ ఆత్మను 'స్త్రీ' అని పిలుస్తారు. దాని బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి, ప్రజలు తమ ఇంటి గోడలపై 'ఓ స్త్రీ, రేపు రా' అని రాసుకుంటారు. రాత్రిపూట ఊళ్లో తిరిగే ఆ ఆత్మ కేవలం మగవాళ్లనే టార్గెట్ చేస్తుంది. వాళ్లను తనతో తీసుకెళ్లి, బట్టలు లేకుండా ఓ నిర్జన ప్రదేశంలో వదిలేస్తుంది. మరి ఆ ఆత్మను హీరో, హీరోయిన్లు ఎలా ఎదుర్కొన్నారు? గ్రామస్థులకు 'స్త్రీ' నుంచి విముక్తి లభించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో చందేరి గ్రామస్థులను 'స్త్రీ' నుంచి రక్షించే విక్కీ పాత్రలో రాజ్‌కుమార్ రావ్ నటించాడు. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమా పాపులారిటీ తగ్గలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో దుమ్మురేపుతోంది. సుమారు ₹25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'స్త్రీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹180 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా, తక్కువ బడ్జెట్‌తో భారీ విజయం సాధించిన చిత్రాల జాబితాలో ప్రత్యేకంగా నిలుస్తోంది.