ఇంటికి వెళ్లిన తర్వాత బండ్ల గణేష్‌ను చూసి చరణ్ "ఏంటి పరిస్థితి?" అని ఆరా తీశారు. దానికి బండ్ల గణేష్ భయపడుతూనే, "అన్నీ దగ్గరకు వచ్చాయి బాబు, కొన్ని క్లియర్ చేయాల్సి ఉంది, సినిమా అవ్వగానే మీ డబ్బులు క్లియర్ చేస్తాను" అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, రామ్ చరణ్ ఆ సమయంలో ప్రవర్తించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని బండ్ల గణేష్ అన్నారు. చరణ్ వెంటనే ఆయనకు టీ, బిస్కెట్లు ఇచ్చి ఆప్యాయంగా సత్కరించి, "ముందు హ్యాపీగా సినిమా రిలీజ్ చేయి గణేష్, మన డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం. ముందు సినిమా థియేటర్లలోకి రావడం ముఖ్యం" అని భరోసా ఇచ్చారు.
కేవలం 30 ఏళ్ల వయసున్న ఒక యంగ్ హీరో, ఆ సమయంలో అంత పెద్ద మొత్తంలో డబ్బు బకాయి ఉన్నప్పటికీ, నిర్మాత పడుతున్న టెన్షన్‌ను అర్థం చేసుకుని సపోర్ట్‌గా నిలవడం మామూలు విషయం కాదని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు, ఆయనకు కళ్లలో నీళ్లు తిరిగాయి. రామ్ చరణ్ వ్యక్తిత్వం, ఆయనకున్న సంస్కారం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన ఉదాహరణ అని బండ్ల అన్నారు.