తెలుగు సినిమాల్లో నటించి తమ క్రేజ్ ని పాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకోడానికి వరస పెట్టి టాలీవుడ్ బాట పట్టారు బాలీవుడ్ భామలు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా తెలుగులో తన రెండో సినిమాని అనౌన్స్ చేసింది.ఎన్టీఆర్,కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా ఆలియా నటిస్తోంది. దీని కంటే ముందే ట్రిపుల్ఆర్ లో రామ్ చరణ్ కి జంటగా నటించి తెలుగు ఎంట్రీ కి రెడీ అయ్యింది.