వీసా రూల్స్ పై మండిపడిన తాప్సీ.. కరెక్ట్ కాదంటూ హీరోయిన్ ఆవేదన

First Published Jan 26, 2024, 4:28 PM IST

మన దేశంలో వీసా రూల్స్ కరెక్ట్ కాదు అంటుంది హీరోయిన్ తాప్సీ.. అంత కఠినంగా ఉండాల్సిన అసరం లేదంటోంది. తనకు ఎదురైన ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ తో షేర్ చేసుకుంది బ్యూటీ. 
 

టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ లో రాణిస్తోన్న హీరోయిన్ తాప్సీ. అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యింది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కూడా సాధించింది. సమస్యలపై స్పందిస్తుంది. అవసరం అయితే పోరాటం కూడా చేస్తుంది. వరుసగా ఆఫర్లు కూడా సాధిస్తోంది. స్టార్ హీరోల సరసన మెరుస్తోంది.  అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. 

రీసెంట్ గా  షారుఖ్ ఖాన్ తో  జోడికట్టింది తాప్సీ.. రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కించిన  డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. లాస్ట్ ఇయర్  డిసెంబర్ 21న  రిలీజ్ అయిన ఈసినిమా యావరేజ్ టాక్ తో నడిచింది.  పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. అయితే ఈమూవీలో  తాప్సీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.. విమర్శకులు నుంచి  ప్రశంసలు వచ్చాయి. 

Latest Videos


Taapsee Pannu

ఇక తాజాగా తాప్సీ చేసిన కామెంట్స్ అందరి చూపు తిప్పేలా చేశాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. విదేశాలకు వెళ్లాలంటే వీసా పొందడం చాలా కష్టంగా ఉంది అన్నారు. అయితే అది తనకు కాదు.. తనలా ఉన్న స్టార్స్ కు .. డబ్బున్న వారికి ఏమాత్రం ఇబ్బంది లేదు.. కాని  సామాన్యులు మాత్రం ఈ విషయంలో  ఎదుర్కొంటున్న సమస్యలను తాప్సీ బయటపెట్టింది. 

డబ్బునవారికి వీసా తొందరంగా వస్తుందని.. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని… వీసా నియమ నిబంధనలు చాలా దురదృష్టకరమని ఆమె  అన్నారు. ఉదాహరణగా డంకీ సినిమా యూనిట్ గురించి మాట్లాడారు తాప్సీ.. ఫిల్మ్‌ఫేర్‌కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లేందుకు డంకీ  మూవీ టీమ్ లో కొందరు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. 

వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. ఎక్కువగా డబ్బులేనివారు.. చదువుకోని వారిపై వీసా నియమాలు ఇబ్బందిని గురిచేస్తాయి. మన సమాజంలో ధనిక, పేదల మధ్య విభజన మరింత పెంచుతుంది. వీసా దరఖాస్తులపై విధించిన ఆర్థిక ప్రమాణాలు అలా ఉన్నాయి. బ్యాంకులలో ఎక్కువగా డబ్బు ఉన్న ధనికులు వీసాలు పొందుతున్నారు. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.

 డంకీ సినిమాను విదేశాల్లో షూట్ చేయాల్సి ఉంది. మా చిత్రయూనిట్ లో కొందరు సభ్యులు తమ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరమైన థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉండడం వల్ల వారు యూకే వీసా పొందడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతపెద్ద ప్రాజెక్టులో వారు ఉన్నప్పటికీ వీసా కోసం ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి నిబంధనలు పేదవారిని ప్రభావితం చేస్తున్నాయి.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది తాప్సీ.

click me!