మరోవైపు మోక్ష.. పంచమి ఊరు వెళ్లతాడు. తనతోపాటు రమ్మని బతిమాలడతాడు. కానీ పంచమి వినిపించుకోదు. తాను ప్రస్తుతం పంచమిని కాదని.. కేవలం ఓ నాగకన్యని మాత్రమే అని చెబుతుంది. తనతో ఉంటే.. జీవితంలో సుఖం, సంతోషం, ఆనందం ఉండవని చెబుతుంది. అయితే.. తనకు అవన్నీ అవసరం లేదని.. నువ్వు నా వెంట ఉంటే చాలు అని మోక్ష ఎంత బలిమిలాడినా పంచమి వినిపించుకోదు. దీంతో.. నిరాశగా.. మోక్ష ఇంటికి వెళ్లిపోతాడు.