SVP Pre release: పోకిరి రోజులు గుర్తొచ్చాయి.. హీరో హీరోయిన్ ట్రాక్ ఈ సినిమాకే హైలైట్: మహేష్ బాబు

Published : May 07, 2022, 11:23 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

PREV
16
SVP Pre release: పోకిరి రోజులు గుర్తొచ్చాయి.. హీరో హీరోయిన్ ట్రాక్ ఈ సినిమాకే హైలైట్: మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడడంతో నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

26

ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం తెరకెక్కిస్తునప్పుడు తనకు పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి అని అన్నారు. పరశురామ్ నా క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారు నా డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో కేర్ తీసుకున్నారు. 

36

ఈ సినిమాని నేను ఒకే చేసినప్పుడు పరశురామ్ ఓ మెసేజ్ పెట్టారు. ఒక్కడు సినిమా చూసి బండెక్కి హైదరాబాద్ వచ్చా. ఇక చూసుకోండి ఇరగదీస్తాను అని మెసేజ్ పెట్టాడు. అన్నట్లుగానే సినిమాని అద్భుతంగా తీశాడు. 

46

ఈ చిత్రంలో హీరో హీరోయిన్ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది. సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఆ సీన్స్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఇది రాసిపెట్టుకోండి అని మహేష్ అన్నారు. కీర్తి సురేష్ చాలా బాగా నటించింది అని ప్రశంసించారు. 

56

తమన్ తో చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మళ్ళి ఇప్పుడు కుదిరింది. తమన్ బిజియం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఈ మూవీలో అదరగొట్టేశాడు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు.. 

66

ఇక ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. నాకు దగ్గర వారిని కూడా కోల్పోయాను. కానీ మీ అభిమానం మారలేదు. అది చాలు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అని మహేష్ బాబు అన్నారు. మే 12న మనందరికీ పండగే అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. 

 

click me!

Recommended Stories