Kangana ranaut: అతన్ని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి ? పర్సనల్ విషయాలపై ఓపెన్ అయిన ఫైర్ బ్రాండ్ కంగనా

Published : Nov 11, 2021, 10:56 AM ISTUpdated : Nov 11, 2021, 11:00 AM IST

బాలీవుడ్ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్  ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో మీకు అన్ని తెలుస్తాయంటున్న కంగనా... జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి ఏం మాట్లాడారంటే....

PREV
16
Kangana ranaut: అతన్ని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి ? పర్సనల్ విషయాలపై ఓపెన్ అయిన ఫైర్ బ్రాండ్ కంగనా
Kangana Ranaut


తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్ (Kangana ranaut) తాను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్ల పెళ్లి చేసుకొని, పిల్లల్ని కూడా కనాలని ప్రణాళిక వేసినట్లు చెప్పి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం లైఫ్ లో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నట్లు, తెలియజేశారు. 

26
Kangana Ranaut


మణికర్ణిక చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కంగనా... పద్మశ్రీ (Padhma shri) అవార్డు పొందిన విషయం తెలిసిందే. భారత రాష్ట్రపతి కంగనా రనౌత్ కి పద్మశ్రీ అవార్డు అందజేశారు. 

36

మీరు ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు కంగనా.. అవును అని సమాధానం చెప్పారు. నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అయితే అతను ఎవరు, పేరు ఏంటి అనే విషయాలు చెప్పను. త్వరలో మీకు తెలుస్తాయి.. అంటూ ఓపెన్ గా చెప్పేశారు. 

46

ఇంకా మాట్లాడుతూ అతని ప్రేమను తాను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకుంటాను. రానున్న ఐదేళ్లలో పిల్లలను కూడా కనాలి. పూర్తి వివరాలు మీకు కొద్దిరోజుల్లో తెలుస్తాయని, క్యూరియాసిటీ పెంచేశారు. 

56

మరోవైపు కంగనా తన సొంత నిర్మాణ సంస్థలో టీకు వెడ్స్ షేరు చిత్రంలో నటిస్తున్నారు. జవాజుద్దిన్ సిద్ధిఖీ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహిస్తున్నారు.

66
Kangana Ranaut

అలాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ధాకడ్ మూవీలో కంగనా నటిస్తున్నారు. అర్జున్ రామ్ పాల్, దివ్య దత్త ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మరో చిత్రం తేజస్ లో కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నారు. 

Also read  నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు... వెంకీ షాకింగ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

Also read RRR movie: అది ఊహాతీతం !

 

click me!

Recommended Stories