RRR movie: అది ఊహాతీతం !

First Published | Nov 11, 2021, 8:12 AM IST

అసలు ఆర్ ఆర్ ఆర్ కథ ఏమిటీ...? రెండు భిన్న కాలాలకు చెందిన కొమరం భీమ్, అల్లూరి ఎలా కలిశారు. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్, అల్లూరి పాత్రలను రాజమౌళి ఎలా చూపించబోతున్నాడనేది ఇప్పటికీ సస్పెన్సు. కాగా దీనిపై ఆర్ ఆర్ ఆర్ టీమ్ ట్వీట్ ద్వారా స్పష్టత ఇచ్చారు.

RRR Movie

పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ ఆర్ ఆర్ (RRR movie) థియేటర్స్ లో దిగడానికి సమయం ఆసన్నమైంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు నెల రోజుల గడువు కూడా లేదు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. టాలీవుడ్ ఇద్దరు టాప్ స్టార్స్ ఎన్టీఆర్ (NTR), చరణ్ లతో ఇండియాలోనే తిరుగులేని డైరెక్టర్ గా పేరుగాంచిన రాజమౌళి చేస్తున్న చిత్రరాజం ఆర్ ఆర్ ఆర్. ప్రోమో వీడియోలు అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉండగా, వెండితెరపై సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్... ఆతృతతో ఉన్నారు. 


ఇక నిన్న విడుదలైన నాటు నాటు సాంగ్... మెగా, నందమూరి ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చింది. అద్భుతమైన డాన్సర్స్ గా ఉన్న ఎన్టీఆర్, చరణ్ (Ram charan) ఒకరికి మించి ఒకరు మాస్ స్టెప్స్ తో , ఫాస్ట్ బీట్ సాంగ్ కి ఇరగదీశాడు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మెస్మరైజ్ చేసేలా సాంగ్ రూపొందించారు. బ్రిటీష్ కోటలో, తెల్లదొరసానుల ముందు ఎన్టీఆర్, చరణ్ మైమరిచి ఆడినట్లు సాంగ్ చూస్తే అర్థం అవుతుంది.
 



 
కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాజమౌళి (Rajamouli) ఏమి చెప్పనున్నాడనే సందేహం అందరిలో ఉంది. ఉద్యమ వీరులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల వాస్తవిక పాత్రలకు ఫిక్షన్ జోడించి, ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని మాత్రం తెలుసు. ఇది వాళ్ళిద్దరి బయోపిక్ కాదని, రాజమౌళి ముందే చెప్పారు. వీరిద్దరి జీవితాలలో కొన్ని సారూప్యతలు ఉన్నాయని, దాని ఆధారంగా ఓ కల్పిత కథతో మూవీ చేయనున్నట్లు ప్రకటన రోజే వెల్లడించడం జరిగింది. 
 


తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజెన్ అభిప్రాయం వెల్లడించారు. 1920లో కొమరం భీమ్, అల్లూరి 2 సంవత్సరాలు పాటు ఇంటిని వదిలి దూరంగా వెళ్లిపోయారు. ఆ పీరియడ్ లో ఏమి జరిగింది అనేది ఫిక్షనల్ గా తీయాలి. కానీ రాజమౌళి మనకు తెలిసిన కథ కూడా, మార్చి తీస్తున్నాడని నా సందేహం.. అంటూ కామెంట్ చేశాడు. ఈ సందేహానికి ఆర్ ఆర్ ఆర్ టీమ్ బదులివ్వడం జరిగింది. 

 'ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా క్లియర్ గా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉండదు. మైండ్ లో నుండి అవ్వన్నీ తీసేసీ హాయిగా సినిమాను ఎంజాయ్ చేయండి' అంటూ బదులు ఇచ్చారు. ఈ కామెంట్ ద్వారా ఆర్ ఆర్ ఆర్ కథ, ప్రేక్షకులు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా, ఊహాతీతంగా ఉంటుందని ఆర్ ఆర్ ఆర్ టీం క్లారిటీ ఇచ్చారు. 

rrr movie


ఆర్ ఆర్ ఆర్ కథకు 2004లో విడుదలైన స్పానిష్ చిత్రం మోటర్ సైకిల్ డైరీస్ స్ఫూర్తి... అని రాజమౌళి తెలియజేశారు. ఆ కథలోని ట్విస్ట్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, దాని ఆధారంగా మనకు తెలిసిన ఇద్దరు చారిత్రక వీరుల పాత్రలతో కథను సిద్ధం చేశామని రాజమౌళి స్పష్టత ఇచ్చారు. 

ఆర్ ఆర్ ఆర్ కథ చరిత్రతో సంబంధం లేకుండా సాగుతుంది. వాస్తవంలో రెండు భిన్న కాలాలకు చెందిన భీమ్. అల్లూరి కలిసే అవకాశం లేదు. ఇక ప్రోమోలలో వాళ్ళ గెటప్స్ చూసినా కూడా ఈ విషయం మనకు అర్థం అవుతుంది. కాబట్టి మనకు తెలిసిన పాత్రలతో కొత్త కథ ద్వారా, రాజమౌళి ఎలాంటి అనుభూతి పంచుతాడో చూడాలి.

Also read RRR Movie: 'నాటు నాటు' లిరికల్ సాంగ్.. బ్రిటిష్ కోటలో చరణ్, ఎన్టీఆర్ దుమ్ములేపే స్టెప్పులు

Also read 'ఆర్ఆర్ఆర్‌' లో డైలాగును స్వ‌యంగా చెప్పిన రాజ‌మౌళి

Latest Videos

click me!