ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కాదా, ఇంకెవరు ? స్టార్ డైరెక్టర్ కామెంట్స్ తో దుమారం

Published : Nov 03, 2025, 05:29 PM IST

ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు పరోక్షంగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాకి కౌంటర్ ఇచ్చారు. 

PREV
15
తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ 

బాహుబలి సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సినిమాల స్వరూపమే మారిపోయింది. సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతున్నారు. రాజమౌళి అయితే ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే చిత్రాలని రూపొందింస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ప్రభాస్ కి 2 ఉన్నాయి. 

25
ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ 

బాహుబలి 2, కల్కి చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇండియాలో ఈ ఘనత ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత కల్కి 2లో నటించాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఆడియో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ప్రభాస్ ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ అభివర్ణిస్తూ టైటిల్ కార్డు వేశారు. 

35
సందీప్ రెడ్డికి బాలీవుడ్ డైరెక్టర్ కౌంటర్ 

అప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ లాంటి అగ్ర హీరోల ఫ్యాన్స్ కి ఇది మింగుడు పడలేదు. దీనితో ప్రభాస్ ని ట్రోల్ చేయడం ప్రారంభిచారు. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రభాస్ ని అభివర్ణించడం బాలీవుడ్ సెలెబ్రెటీలకు కూడా నచ్చినట్లు లేదు. బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన సిద్దార్థ్ ఆనంద్.. సందీప్ రెడ్డి వంగాకి కౌంటర్ ఇచ్చినట్లుగా రీసెంట్ గా సోషల్ మీడియా పోస్ట్ చేశారు. 

45
ఇండియాకి కింగ్ అతడే 

ఇటీవల కింగ్ ఖాన్ షారుఖ్ తన 60 పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకున్నారు. షారుఖ్ బర్త్ డే సందర్భంగా సిద్ధార్థ్ ఆనంద్ పోస్ట్ చేస్తూ.. 'సూపర్ స్టార్ స్థాయిని మించిపోయిన వారిని కింగ్ అని పిలుస్తారు.. హ్యాపీ బర్త్ డే ఇండియాస్ కింగ్' అంటూ షారుఖ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిద్దార్థ్ ఆనంద్ చేసిన ఈ కామెంట్స్ స్పష్టంగా.. 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్' అనేదానిపై కౌంటర్ గానే అనిపిస్తోంది. 

55
బాలీవుడ్ దర్శకుడికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్ 

సిద్దార్థ్ ఆనంద్ కామెంట్స్ కి సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్ కింగ్ అయితే.. ప్రభాస్ ఎంపరర్ అని పోస్ట్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వివాదం క్రమంగా తీవ్రంగా అగ్లీగా మారుతోంది. సిద్ధార్థ్ ఆనంద్.. షారుఖ్ ఖాన్ తో పఠాన్ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  

Read more Photos on
click me!

Recommended Stories