Naga Chaitanya: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఆ హీరో ?.. పిచ్చి కామెంట్స్ తో రచ్చకెక్కిన నటుడు

Published : Jul 28, 2022, 11:18 AM IST

సమంత, నాగ చైతన్య విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఎవరి బిజీ లైఫ్ లో వారు ఉన్నారు. కానీ చైతు, సమంత గురించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. నాగ చైతన్య రీసెంట్ గా థాంక్యూ అనే చిత్రంలో నటించాడు.

PREV
16
Naga Chaitanya: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఆ హీరో ?.. పిచ్చి కామెంట్స్ తో రచ్చకెక్కిన నటుడు

సమంత, నాగ చైతన్య విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఎవరి బిజీ లైఫ్ లో వారు ఉన్నారు. కానీ చైతు, సమంత గురించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. నాగ చైతన్య రీసెంట్ గా థాంక్యూ అనే చిత్రంలో నటించాడు. సమంత పలు చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా సామ్ కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పాల్గొంది. సమంత తొలిసారి ఈ షోలో తన డివోర్స్ గురించి మాట్లాడింది. 

26

బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్, నటుడు కమల్ ఖాన్ తరచుగా పిచ్చి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అలాగే సినిమాలకు రివ్యూలు ఇస్తుంటాడు. ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా కమల్ ఖాన్ నాగ చైతన్య, సమంతపై పడ్డాడు. నాగ చైతన్య నటించిన తొలి బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చైతు కీలక పాత్రలో నటించాడు. 

36

చైతు, సమంత విడాకుల వ్యవహారంలోకి కమల్ ఖాన్ అమీర్ ఖాన్ ని లాగాడు. అతడు చెబుతున్నది ఏంటంటే.. లాల్ సింగ్ చద్దా విషయంలో నాగ చైతన్య తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడట. ఈ సినిమాలో నటించినందుకు చైతు బాధపడుతున్నాడట. సినిమా బాగాలేదని.. తప్పక ప్రమోషన్స్ చేస్తూ సినిమా అద్భుతంగా ఉందని చెప్పాల్సి వస్తోందని చైతు ఫీల్ అవుతున్నాడట. 

46
নাগা- চৈতন্য

అంతే కాదు.. అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు నుంచి 2021లో విడిపోయారు. సమంత, చైతు కూడా 2021లోనే విడాకులు పొందారు. సమంత నుంచి విడాకులు పొందేందుకు చైతూని అమీర్ ఖాన్ కన్విన్స్ చేశాడు అంటూ కమల్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు చేసేవి పిచ్చి కామెంట్స్, అర్థం లేనివి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

56

సోషల్ మీడియాలో అటెన్షన్, వీడియోలకు వ్యూస్ కోసమే కమల్ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేస్తుంటాడని.. పలు సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నాడు అని నెటిజన్లు అంటున్నారు. 

66

లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగష్టు 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. లాల్ సింగ్ చడ్డా కనుక విజయం సాధిస్తే 'థాంక్యూ' పరాజయం నుంచి నాగ చైతన్యకి కాస్త ఊరట లభించినట్లు అవుతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories