బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఇటీవల మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో గ్లామర్ షో చేస్తూ నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) పేరు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. వరుస చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. పాత్ర ప్రాధాన్యతను బట్టి అవసరమైతే బోల్డ్ సీన్లలోనూ నటిస్తోంది.
26
ఇటీవల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్ డ్రామా గెహ్రైయాన్ (Gehraiyaan)తో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకుణె (Deepika padukone), సిద్దాంత్ చతుర్వేదితో కలిసి నటించింది. ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సీన్లలోనూ నటించి ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
36
అంతే కాకుండా ఆ చిత్ర ప్రమోషన్స్ కు కూడా చాలా బోల్డ్ గా ఫొటోషూట్ నిర్వహించింది. బికినీల్లో దీపికా పదుకునే, అనన్య పాండే వరుస ఫొటోషూట్లు చేసి ఆ మధ్య సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనన్య పాండే పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
46
నల్లటి దుస్తులలో మతిపోయేలా పోజులిచ్చింది అనన్య. లోయర్‌లతో జత చేసిన క్రాప్ టాప్‌లో అందాల విందుచేస్తూ మతిపోగొడుతోంది. తన గ్లామర్ షోకు కుర్రాళ్ల గుండెల గల్లంతవుతున్నాయి. గుచ్చే చూపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ బ్యూటీ.
56
అయితే ఈ పిక్స్ ను పోస్ట్ చేస్తూ.. ‘అందంగా అనిపించింది.. తర్వాత తొలగించడం నాకు ఇష్టం లేదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే తన పోస్ట్ పై తన స్నేహితురాలు షానాయ కపూర్ స్పందించింది. ‘ఓహ్ వాట్ ఎ బాడాస్’ అంటూ ఎగతాళిగా కామెంట్ చేసింది. మరోవైపు నెటిజన్లు తను పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.
66
ప్రస్తుతం అనన్య పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లు వస్తున్న చిత్రం ‘లైగర్’లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీతో తొలిసారి తెలుగు ఆడియెన్స్ కు అనన్య పాండే పరిచయం కానుంది.