అంతటితో ఆగలేదు. ఈ సందర్భంగా మమ్మల్ని చూసి, మా సినిమాని చూసి కుళ్లుకోవాలని రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను ఉద్దేశించి చెప్పింది సుమ. ఇది ఆద్యంతం నవ్వులు పంచింది. షోలో సందడి నెలకొంది. అయితే సుమ ఈ డైలాగ్ చెబుతున్నప్పుడు వెనకాల స్క్రీన్‌లో కీరవాణి వెన్నుపోటు పొడుస్తున్న పోస్టర్‌ని డిస్ ప్లే చేయడం దుమారం రేపుతుంది. ఇందులో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను వెనకాల నుంచి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వెన్నుపోటు పొడుస్తున్నారు. `బాహుబలి` చిత్రంలో బాహుబలి ప్రభాస్‌ని కట్టప్ప సత్యరాజ్ వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా ఈ పోస్టర్‌ని డిజైన్ చేయడం విశేషం. సరదాగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.