మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ చకాచకా జరుగుతోంది.
‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహాలో సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రాండ్ విజువల్స్ తో పాటు బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి... దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Vishwambhara
అయితే.... ‘విశ్వంభర’ సినిమా (Vishwambhara Movie) నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ అందాయి. సినిమాపై హైప్ ను పెంచాయి. తాజాగా మరో క్రేజీ అప్డేట్ అందింది. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ లో బాలీవుడ్ నటి స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అయ్యింది.
ఈ మేరకు సినీ వర్గాల్లో న్యూస్ వైరల్ గా మారింది. అయితే చిరు పక్కన గ్లామర్ స్టెప్పులు వేయబోయే సుందరి మరెవరో కాదు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) అని తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. మున్ముందు వచ్చే ఛాన్స్ ఉంది.
Vishwambhara
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో నటి ఊర్వశీ రౌటేలా వెండితెరపై స్పెషల్ డాన్స్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి చిరుతో ఐటెం సాంగ్ కు ఎంపికవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. బడా హీరోతో రెండోసారి అవకాశం దక్కడం లక్కీ అనే అంటున్నారు.
Vishwambhara
ప్రస్తుతం చిరంజీవి యూఎస్ ట్రిప్ లో ఉన్నారు. తిరిగి రాగానే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సౌత్ క్వీన్ త్రిష (Trisha) కథానాయికగా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.