సీనియర్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. వాటి ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్బంగా పలు ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్ లలో తన మనస్సులోని మాటను బయటపెడుతూ వస్తోంది.
ఆ మధ్యలో తను విలన్స్ రోల్స్ తో నటించానుకుంట్టు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్స్, సెలబ్రెటీలు చేస్తున్న ఓ పనిని బయటపెట్టింది. దానికి వారు డబ్బులు కూడా ఇస్తారంటూ చెప్పుకొచ్చింది.
ఇంతకీ ప్రియమణి బాలీవుడ్ స్టార్స్ గురించి చెప్పిన విషయాలు ఏంటంటే... సాధారణంగా హీరోయిన్లు, స్టార్స్ ఎయిర్ పోర్ట్స్ వద్ద, జిమ్ ల వద్ద, పలు షాపింగ్ మాల్స్ వద్ద సందడి చేస్తున్నట్టుగా వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే.
పలానా సెలబ్రెటీలు వస్తున్నట్టు అసలు వారికి ముందే ఎలా తెలుస్తుందనే సందేహం అందరికీ ఉంటుంది. తాజాగా ప్రిమయణి వాటిపై స్పందించారు. సోషల్ మీడియా, కెమెరా మెన్లకు డబ్బులిచ్చి మరీ అలా పబ్లిసిటీ చేసుకుంటారంటూ చెప్పుకొచ్చింది.
తను కూడా చేయాలనుకున్నడ్డు అందుకు సంబంధించి ఎంత ఛార్జ్ అవుతుందో ఓ ఏజెన్సీ వ్యక్తి తనకు చార్ట్ పంపినట్టు చెప్పుకొచ్చింది. ఇక సెలబ్రెటీలు పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వడం సాధారణ జనాలకు కాస్తా కన్నుల పండుగలానే ఉంటుంది.
ఇలా సోషల్ మీడియాలో మరింతగా వీడియోలను వైరల్ చేస్తూ... ఇంకా క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇది సర్వసాధారమణమే.. కానీ స్టార్స్ కు ఉండే క్రేజ్ తో కాకుండా డబ్బులిస్తేనే అలా వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తారనే విషయం ప్రియమణి ద్వారా తేటతెల్లమైంది. ప్రస్తుతం ‘భామా కలాపం 2’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘ఖైమార’, ‘మైదాన్’ చిత్రాల్లో నటిస్తోంది.