హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు ఒక రూల్..
"నా కెరీర్‌ను శిఖరానికి తీసుకెళ్లే అవకాశం చేజారిపోయింది. ఆ నిజాన్ని గ్రహించడానికి నాకు సంవత్సరాలు పట్టింది. దాని నుండి బయటపడటానికి నేను థెరపీ తీసుకోవలసి వచ్చింది," అని రాధిక చెప్పింది. దాని తర్వాత తన ఆలోచన మారిందని రాధిక చెప్పారు.
ఆ సంఘటన తనకు ఒక వరంలాంటిదని రాధిక చెప్పింది. ఆ తర్వాత, తాను అందం గురించి ఎక్కువగా ఆందోళన చెందలేదు. ఎవరి కోసం తాను బరువును మార్చుకోలేనని, తనపై తనకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని ఆమె చెప్పింది. తాను బిడ్డ పుట్టిన తర్వాత కేవలం మూడు నెలలకే మళ్లీ వచ్చి సినిమా చేశానని, ఆ సినిమా చేసిన సమయంలో తాను బాగా బరువు పెరిగే ఉన్నాను అని.. కానీ ఆందోళన చెందకుండా కేవలం నటన మీద మాత్రమే ధ్యాస పెట్టాను అని ఆమె చెప్పారు.
‘ వయసు విషయంలో కూడా పురుషులకు, మహిళలకు మధ్య తేడా ఉంటుంది. పురుషులకు వయసు పెరగడం అంటే ముసలితనం రావడం కాదు. కానీ మహిళలకు వయసు పెరగడం అంటే ముసలితనం రావడం లాంటిదే. ఈ తేడా ముఖ్యంగా సినిమా రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది’ అని రాధిక ఆప్టే చెప్పారు.