లెహంగా చోళీలో కట్టిపడేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఆ నటుడితో ‘సీతారామం’ హీరోయిన్ సందడి!

First Published | Feb 14, 2023, 6:28 PM IST

‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Murnal Thakur) సంప్రదాయ దుస్తుల్లో  కట్టిపడేస్తున్నారు. బాలీవుడ్ లో దూసుకుపోతున్న ఈ భామ తాజాగా ఓ ఫ్యాషన్ లో పెళ్లి కూతురు ముస్తాబులో ఆకట్టుకున్నారు. 
 

బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హిందీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. గతేడాది వరకు కాస్తా నెమ్మదిగా సాగిన ఈ బ్యూటీ కేరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇందుకు కారణంగా.. 2022లో విడుదలైన చిత్రాలేనని చెప్పొచ్చు.
 

గతేడాది మృణాల్ ఠాకూర్ నటించిన ‘జెర్సీ’(హిందీ), తెలుగు సినిమా ‘సీతారామం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా Sitaramamతో  మృణాల్ కేరీర్ మలుపు తిరిగిందనే చెప్పాలి. జెర్సీతోనూ నార్త్ ఆడియెలో మంచిక్రేజ్ దక్కించుకున్నారు. 
 


దీంతో హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటున్నారు ఈ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సందర్భంగా పలు ఈవెంట్లు, ఫ్యాషన్ షోలకూ వెళ్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్‌లో మృణాల్ ర్యాంప్ వాక్ చేశారు. 
 

పెళ్లికూతురిగా మృణాల్ ఠాకూర్ ముస్తాబై ఆకట్టుకున్నారు. లెహంగా చోళీలో కట్టిపడేశారు. సంప్రదాయ దుస్తుల్లో బాలీవుడ్ భామ మెరిసిపోతున్నారు. అయితే ఈవెంట్ లో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది (siddhant chaturvedi)తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 

తాజాగా ఈవెంట్ సందర్భంగా సిద్ధాంత్ చతుర్వేది, అబుజానీతో కలిసి ఫొటోషూట్ కూడా చేశారు. ఆ ఫొటోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సందప్రాయ దుస్తుల్లో ఈ బ్యూటీ మెరిసిపోతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 

ఇక మృణాల్ ఠాకూర్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నారు. వీటిలో నాలుగు చిత్రాలు హిందీలో రూపుదిద్దుకుంటున్నారు. ఇందులో మూడు హిందీ చిత్రాలు పూర్తై రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ‘Nani30’లో నటిస్తున్నారు. 

Latest Videos

click me!