గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘ఐ’ మూవీ హీరోయిన్.. అస్సలు అమీ జాక్సన్ లానే లేదుగా..

First Published | Sep 22, 2023, 4:06 PM IST

బాలీవుడ్ నటి అమీ జాక్సన్ లేటెస్ట్ లుక్  నెట్టింట వైరల్ గా మారింది. మరీ బక్కచిక్కిపోయి కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పేల్చుతున్నారు.
 

బాలీవుడ్ నటి అమీ జాక్సన్ (Amy Jackson)  ఇప్పటికే దక్షిణాది ఆడియెన్స్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. కోలీవుడ్ చిత్రం ‘మద్రసపట్నం’తో నటిగా వెండితెరపై వెలిగింది. సౌత్ ఆడియెన్స్ ను తొలిసారిగా పలకరించింది. 
 

ఆ వెంటనే బాలీవుడ్ లో అడుగుపెట్టి సెన్సేషన్ గా మారింది. అలాగే తమిళం, తెలుగులోనూ భారీ చిత్రాల్లో మెరిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. తెలుగులో ఆమె చేసిన ఒక్కటే చిత్రమిది.
 


ఆ తర్వాత తమిళంలో ‘రోబో 2.0’, ‘ఐ’ మూవీ చిత్రాల్లో నటించింది. ఇలాంటి భారీ చిత్రాల్లో నటించిన అమీజాక్సన్ అందంతో వెండితెరపై కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన సినిమాల కోసం అమీజాక్సన్ లుక్ మారుస్తూ ఉంటుంది.
 

ఈ క్రమంలో లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ అమీజాక్సన్ అంటే గుర్తుపట్టడం కష్టంగా మారింది. హెయిర్ స్టైల్ చిన్నగా, కంటిబొక్కలు పైకి కనిపించే లుక్ లో మరీ దారుణంగా మారిపోయింది. ఏమాత్రం అమీజాక్సన్ లా లేదనేలా ఉంది.
 

దీంతో అమీజాక్సన్ ఏమైనా వ్యాధితో బాధపడుతుందా? లేదంటే తన సినిమా కోసం ఇలాంటి లుక్ లోకి మారిపోయిందా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొందరు నెటిజన్లు మాత్రం ఫన్నీ పంచులు పేల్చుతున్నారు. 
 

‘ఐ’ సినిమాలో విక్రమ్ ను మోసం చేసినందుకు చియాన్ పగ తీర్చుకున్నాడంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్నాళ్లకు రివేంజ్ తీర్చుకున్నారంటున్నారు. మొత్తానికి లేటెస్ట్ లుక్ ఏమీ బాలేదని, గతంలోనే బ్యూటీఫుల్ గా ఉందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తోంది. 
 

Latest Videos

click me!