ఆమె పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావు, జీవితంలో మర్చిపోలేను, సీనియర్ యాక్టర్ నరేష్ సంచలన కామెంట్స్

నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు సీనియర్ యాక్టర్ నరేష్. ఫిల్మ్ కెరీర్ లో ఎంత సక్సెస్ సాధించాడో..పర్సనల్ లైఫ్ లో అన్ని కాంట్రవర్సీలుఫేస్ చేస్తున్నాడు. తాజాగా తన మూడో భార్య పెట్టిన బాధలగురించి క్లారిటీ ఇచ్చాడు నరేష్.

Senior Actor Naresh Comments about His ex Wife Ramya Raghupathi JMS

ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూ వస్తున్నారు పవిత్ర లోకేష్ - నరేష్లు. వివాదాస్పంద వ్యాఖ్యలు .. వివాదాస్పద పనులతో... లైమ్ లైన్ లో ఉంటూ వస్తున్న ఈ కపుల్ .. తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.అయితే ఈసారి మాత్రం నరేష్ మాత్రమే కొత్త కామెంట్స్ చేశారు. రమ్య రఘుపతి పెట్టిన బాధలు మర్చిపోలేంటూ పరోక్షంగా ఆయన గుండెల్లోని ఆవేదనను వెల్లడించాడు. 

Senior Actor Naresh Comments about His ex Wife Ramya Raghupathi JMS

చాలా  కాలంగా స‌హ‌జీవనం చేస్తు... టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అనిపించుకుంటున్నారు... సీనియర్ నటీనటులు న‌రేష్‌, ప‌విత్ర లోకేష్. అసలు వీళ్లు పెళ్లి చేసుకున్నారా..? ఏక కలిసి జీవిస్తున్నారా..? లేక ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు. ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు.  రీసెంట్ గా పెళ్లి  చేసుకున్నట్టుగా టాక్ వినిపించింది. కాని చేసుకోలేదంటారు కొందరు. 


నటుడు న‌రేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా.. ప‌విత్ర‌కు మాత్రం ఇది రెండే పెళ్ళి. అయితే గత  కొద్ది రోజుల నుండి న‌రేష్‌, ప‌విత్రల విషయంలో రకరకాల వర్తలు నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్నాయి.  గత కొద్ది కాలంగా వీరి గురించి పెద్దగా వార్తలు రావడంలేదు.. కాస్త విషయం సైలెంట్ అయ్యింది . కానీ తాజాగా నరేష్ కామెంట్స్ తో మరోసారి ఈ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటీ అంటే..? 

ప్రస్తుతం నరేష్ , పవిత్ర ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని  తిరుగుతుననారు. పలు షోలకి, ఈవెంట్స్ కి జంటగా అటెండ్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.  అంతేకాకుండా ఇటీవల వారిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి సినిమా కూడా తీశారు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారో తెలియదు కానీ హీరో నరేష్ మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. ఇక తాజాగా నరేష్ తన సినిమా కెరీర్ లో 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ ఈవెంట్ కి హాజరయ్యారు.

Actor Naresh-Pavitra Lokesh and wife Ramy Rghupati

ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా లైఫ్ లో తాను ఎన్నో కష్టాలు.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చాడు నరేష్. మాటల మధ్యలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. రమ్య రఘుపతి పెట్టిన బాధలు మర్చిపోలేంటూ పరోక్షంగా ఆయన గుండెల్లోని ఆవేదనను వ్యక్తపరిచాడు. అంతేకాదు..ఆమె దగ్గర నా బిడ్డ ఉండడం సేఫ్ కాదని.. అది అతడి ఫ్యూచర్ కి చాలా డేంజర్ అని భావించాడు.

అసలు ఆమెతో పెళ్లయితే అయింది కానీ ఏనాడు సంతోషంగా లేనని బాధపడ్డాడు (Naresh) నరేష్. అన్ని బాధల్లో ఉన్నప్పుడు పవిత్ర తన లైఫ్ లోకి రావడం చాలా చాలా సంతోషంగా అనిపించిందని.. నన్ను నన్నుగా అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ దొరికినందుకు.. సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Videos

vuukle one pixel image
click me!