Bigg Boss Telugu 7: మాకున్న ఆస్తి ఎంతంటే, టైటిల్ గెలిస్తే ఆ డబ్బులతో... పల్లవి ప్రశాంత్ తండ్రి కీలక వ్యాఖ్యలు!

Published : Sep 22, 2023, 03:55 PM IST

పల్లవి ప్రశాంత్ కి కోట్ల రూపాయల ఆస్తి ఉందంటూ వార్తలు ప్రచారం అవుతుండగా ఆయన పేరెంట్స్ స్పందించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
Bigg Boss Telugu 7: మాకున్న ఆస్తి ఎంతంటే, టైటిల్ గెలిస్తే ఆ డబ్బులతో... పల్లవి ప్రశాంత్ తండ్రి కీలక వ్యాఖ్యలు!
Bigg Boss Telugu 7


పల్లవి ప్రశాంత్ పేదవాడు కాదు, అతనికి కోట్ల ఆస్తి ఉందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం పల్లవి ప్రశాంత్ కి సొంత ఊరిలో దాదాపు 26 ఎకరాల పొలం ఉందట. అలాగే మంచి ఇల్లు, కారు కూడా ఉన్నాయట. అతడికి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండటంతో ఆ పనులకు సంబంధించిన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడట. 

25

వారసత్వంగా పల్లవి ప్రశాంత్ కి ఆస్తులు ఉన్నాయి. అతడు మరీ పేదవాడు కాదు. అతని పొలం, ఇల్లు, కార్లు విలువ కలిపితే కోట్లలో ఉంటుందని ఓ వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్తలపై పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించాడు. మాకు కోట్ల ఆస్తులు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు.

35
Bigg Boss Telugu 7

మాకు 26 ఎకరాల పొలం ఉంటే అది ఎక్కడో చూపించాలి. మాకు కేవలం 6 ఎకరాల పొలం ఉంది. అది పంచితే పల్లవి ప్రశాంత్ వాటా 2 ఎకరాలు వస్తుంది. మాకు కార్లు, బిల్డింగ్లు లేవు. అవన్నీ ఉంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి ఎందుకు వస్తాడు చెప్పండి. మేము పేదవాళ్ళమే అని ఆయన అన్నారు.

45
Bigg Boss Telugu 7

రైతుబిడ్డ అంటే అందరికీ చులకనే, తక్కువ భావనతో  చూస్తారు. బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ని మర్యాద లేకుండా మాట్లాడుతుంటే బాధేసింది. పల్లవి ప్రశాంత్ ఒకవేళ టైటిల్ గెలిస్తే ఆ డబ్బు రైతులకే ఇస్తాం. అంతకన్నా సంతోషం ఏమి ఉంటుంది. భూమిని నమ్ముకుని మా కళ్ళ ముందు ప్రాణాలు వదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైతుల బాధ నాకు తెలుసు, అని పల్లవి ప్రశాంత్ తండ్రి అన్నారు.

55
Bigg Boss Telugu 7

కాగా పల్లవి ప్రశాంత్ కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టాడు. అతడికి ప్రేక్షకులు బాగా ఓట్లు వేస్తున్నారు. మొదటి రెండు వారాలు పల్లవి ప్రశాంత్ నామిషన్స్ లో ఉన్నాడు. అందరికంటే ఎక్కువ ఓట్లు అతనికి దక్కాయని సమాచారం. 
పల్లవి ప్రశాంత్, 
 

Read more Photos on
click me!