`బిగ్‌బాస్‌5` హోస్ట్ గా అరియానా.. రచ్చ మామూలుగా లేదుగా..నాగార్జున తర్వాత ఆమెదే హవా..

Published : Aug 15, 2021, 08:36 AM ISTUpdated : Aug 15, 2021, 11:08 AM IST

బిగ్‌బాస్‌4తో సంచలనం సృష్టించిన అరియానా గ్లోరి బిగ్‌ ఆఫర్‌ కొట్టేసింది. ఏకంగా బిగ్‌బాస్‌ని లీడ్‌ చేసే అరుదైన ఛాన్స్ ని దక్కించుకుంది. నాగార్జున తర్వాత ఆమెనే తన హవా చూపించబోతుంది. తాజాగా ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.   

PREV
110
`బిగ్‌బాస్‌5` హోస్ట్  గా అరియానా..  రచ్చ మామూలుగా లేదుగా..నాగార్జున తర్వాత ఆమెదే హవా..

బుల్లితెరపై రియాలిటీ షో `బిగ్‌బాస్‌` ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఈ షో కోసం ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గం ఏర్పడింది. ఏజ్‌లకు అతీతంగా ఇంటిళ్లిపాది చూసే షోగా, దాంతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందే షోగా నిలిచిది. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. 

210

ఈ సారి బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి రంగం సిద్ధమైంది. సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్‌ 5నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. రెండు ప్రోమోలు రిలీజై సందడి చేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జునని కన్ఫమ్‌ చేస్తూ ప్రోమో వచ్చేసింది. ఇంట్లో ఉన్న బోర్‌ ఫీలింగ్‌కి బ్రేక్‌ చెప్పేయండి అంటూ నాగ్‌ తనదైన స్టయిల్‌లో ఎంట్రీ ఇచ్చారు. 

310

బిగ్‌బాస్‌ 5 సీజన్‌ కంటెస్టెంట్లు యాంకర్‌ రవి, నటి ప్రియా, ట్రాన్స్ జెండర్‌ ప్రియాంక, యాంకర్‌ వర్షిణి, యానీ మాస్టర్‌, కార్తీక దీపం భాగ్య, నటి లహరి, నవ్యస్వామి, యూట్యూబర్‌ నిఖిల్‌, యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జస్వంత్‌, వీజే సన్నీ, ఆర్జే కాజల్‌, లోబో, సిరి హన్మంత్‌, ఆట సందీప్‌ భార్య జ్యోతి, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా ఈ నెల 22 నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లబోతున్నారని సమాచారం.

410

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ 5 హోస్ట్ గా అరియానా సందడి చేయబోతున్నారనే వార్త వైరల్‌ అవుతుంది. అయితే ఆమె బిగ్‌బాస్‌ మెయిన్‌ షోకి కాదు, `బిగ్‌బాస్‌ బజ్‌` షోకి హోస్ట్ చేయబోతుందట. ఈ షోకు హోస్ట్‌ గా గత సీజన్‌ హౌజ్‌లో అంత్యంత క్రేజ్‌ సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌ను హోస్ట్ గా నిర్ణయిస్తారు నిర్వహకులు. 

510

గత సీజన్లో హీరో తనిష్‌, రాహుల్‌ సిప్లీగంజ్‌లు హోస్ట్‌గా వ్యవహరించగా ఈ సారి బిగ్‌బాస్‌ బజ్‌కు అరియాన గ్లోరీని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంతో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన హౌజ్‌లో వారి అనుభవాన్ని, ఇతర ఆసక్తిరకర విషయాలపై చర్చిస్తారు. 

610

కాగా నాలుగవ సీజన్‌లో అరియాన హౌజ్‌లో తనదైన తీరు, ముక్కుసూటి తనంతో ఎంతో మంది ప్రేక్షక ఆదరణను పొందింది. నేపథ్యంలో ఆమెకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బిగ్‌బాస్‌ బజ్‌కు అరియానను హోస్ట్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

710

అరియానా బోల్డ్ నెస్‌తో, డేరింగ్‌ స్టెప్పులతో హౌజ్‌లో తనకంటూ ఓ గుర్తింపు, బయట భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. నాల్గో సీజన్‌లో టాప్‌ 5లో నిలిచింది. ఆ తర్వాత షో అయిపోయిన తర్వాత కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటోంది. 

810

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో అరియానా బోల్డ్ నెస్‌ మరింతగా బయటకు వచ్చింది. ఈ ఇంటర్వ్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా `బిగ్‌బాస్‌ బజ్‌` కి హోస్ట్ గా చేయడంతో మళ్లీ అరియానా సందడి ప్రారంభమైందని చెప్పొచ్చు. 

910

అరియానా ప్రస్తుతం పలు షోలో గెస్ట్ గా సందడి చేయడం, కామెడీస్టార్స్ వంటి షోలో కామెడీ చేయడంతోపాటు తాజాగా బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌, టీవీ9 యాంకర్‌ దేవి నాగవళ్లీ దర్శకత్వంలో `18901` అనే షార్ట్ ఫిల్మ్ చేస్తుంది. రియల్‌ ఇన్సీడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.

1010

అరియానా ప్రస్తుతం పలు షోలో గెస్ట్ గా సందడి చేయడం, కామెడీస్టార్స్ వంటి షోలో కామెడీ చేయడంతోపాటు తాజాగా బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌, టీవీ9 యాంకర్‌ దేవి నాగవళ్లీ దర్శకత్వంలో `18901` అనే షార్ట్
ఫిల్మ్ చేస్తుంది. రియల్‌ ఇన్సీడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories