విజయ్ దళపతికి పోటీగా హాట్ హీరోయిన్, ఎలక్షన్ హీట్ పెంచబోతున్న బోల్డ్ బ్యూటీ..

Published : Apr 14, 2024, 10:40 AM IST

ఈమధ్యే రాజకీయపార్టీని ప్రకటించాడు సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి. నెక్ట్స్ తమిళనాడు ఎలక్షన్స్ కు అంతా సిద్దం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో విజయ్ పై పోటీ చేయడానికి తమిళ స్టార్ హీరోయిన్ సై అంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.

PREV
17
విజయ్ దళపతికి పోటీగా హాట్ హీరోయిన్, ఎలక్షన్ హీట్ పెంచబోతున్న బోల్డ్ బ్యూటీ..
Vijay starrer Thalapathy 69 film updates producer opted out

ఈమధ్యే రాజకీయపార్టీని ప్రకటించాడు సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి. నెక్ట్స్ తమిళనాడు ఎలక్షన్స్ కు అంతా సిద్దం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో విజయ్ పై పోటీ చేయడానికి తమిళ స్టార్ హీరోయిన్ సై అంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.

27

తమిళనాట రాజకీయానికి సినిమా గ్లామర్ సర్వసాధారణమే. తమిళదేశాన్ని ఎప్పటి నుంచో.. సినిమావాళ్లే ఏలుతున్నారు. ఈక్రమంలో అన్నాదురై, ఎమ్జీ రామచంద్రన్, జయలలిత, కరుణానిథి లాంటివారు సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారే. ఇక ఇప్పిటికీ ఎంతో మంది తారలు తమిళరాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఈక్రమంలో తమిళనాట స్టార్ హీరో విజయ్ దళపతి కొత్త పార్టీని ప్రకటించారు., 

37

2026 లో త‌మిళ‌నాడు అసెంబ్లీక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల బ‌రిలోనిలవడానికి రెడీ అవుతున్నాడు విజయ్. ఈ ఎన్నికల్లో  సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలామంది సెల‌బ్రిటీలు పోటీ చేయ‌నున్నారు. అయితే విజయ్ పై పోటీ చేయడానికి రెడీ అవుతోంది కోలీవుడ్ బోల్డ్ హీరోనయిన్. 

47

ఇంతకీ ఆమె ఎవరో కాదు సినీయ‌ర్ హీరోయిన్ న‌మిత.  ఆమె కూడా తమిళనాట పోటీ చేయడానికి రెడీ అవుతోంది.  2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా ఆమె  బ‌రిలో దిగుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. అది కూడా ద‌ళ‌ప‌తి విజ‌య్‌ను ఢీకొన‌బోతున్న‌ట్లు ఆమె క్లారిటీ ఇచ్చేశారు. 2026 ఎన్నిక‌ల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా విజ‌య్‌పై పోటీ చేస్తాను.  అని ఆమె అన్నారు. 
 

 

57

అంతే కాదు ఇలా పోటీ చేయడానికి గల కారణం కూడా తెలిపారు నమిత. తెలివైన ప్ర‌త్య‌ర్థిపై పోటీ చేస్తే రాజ‌కీయ ఎదుగుద‌ల ఉంటుంది. అందుకే విజ‌య్‌పై పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను అన్నారు. అత‌ను కూడా రాజ‌కీయాల్లో రాణించాల‌ని కోరుకుంటున్నాను" అని న‌మిత విజయ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

67

ఇక ఈ విష‌యంలో సోషల్ మీడియా జనాలు.. రకరకాలుగా స్పందిస్తున్నారు. న‌మిత‌కు డిపాజిట్లు కూడా రావనివిజయ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతుంటే..  మ‌రికొంద‌రు మాత్రం విజ‌య్‌పై న‌మిత విజ‌యం సాధించే అవ‌కాశం ఉందంటున్నారు. ఇక నమిత ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు.  త‌మిళ‌నాడు బీజేపీ పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలిగా కొనసాగుతున్నారు. 

77

విజ‌య్ 2026 తమిళనాడు ఎలక్షన్స్ టార్గెట్ గా 'తమిళక వెట్రి కజగం' అనే పార్టీని ప్రకటించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదు అని కూడా ఆయన గతంలోనే ప్రకటించారు. ఇక నమిత ప్రకటన ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు.. రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories