‘కంగువా’: బాబి డయోల్ కి భారీ రెమ్యూనరేషన్, ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

First Published | Nov 15, 2024, 7:44 PM IST

స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దిశా పటాని .. బాబీ డియోల్ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించారు. 

Bobby Deol, Kanguva, Kollywood

తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా నవంబరు 14 (గురువారం)న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరో మూడు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దాదాపు.350 కోట్ల భారీ బడ్జె‌ట్‌తో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సూర్య సరసన దిశాపటాని నటించగా.. బాబీ డియోల్‌ విలన్‌గా నటించారు.

ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ వైజ్ , ఓపినింగ్స్ పరంగానూ బాగానే రాబట్టింది. తమిళనాడులో సూర్యకు ఉన్న క్రేజ్ తో భారీ రిలీజ్ , భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఈ సినిమాలో బాబీ డయోల్ లుక్ కు మంచి పేరు వచ్చింది. ఇంతకీ బాబీ డయోల్ కు ఈ సినిమా నిమిత్తం ఎంత ముట్టిందో చుద్దాం. 
 

Kanguva Movie

స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దిశా పటాని .. బాబీ డియోల్ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించారు.

ఈ సినిమాలో హీరోయిన్ దిశాపటానికి రూ.3 కోట్లు ఇవ్వగా.. యానిమల్ సినిమాలో విలన్‌తో భారీగా క్రేజ్ పెంచుకున్న బాబీ డియోల్‌కి రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తమిళ సిని వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి.  ఇంత పెద్ద మొత్తం ఇవ్వటానికి గల కారణం హిందీ మార్కట్ కు బాబి డయోల్ ప్లస్ అవుతారనే తెలుస్తోంది. అలాగే చాలా రోజులు డేట్స్ తీసుకున్నట్లు వినికిడి. 
 


Kanguva


ఇక విలన్‌గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదనే రివ్యూలు వచ్చాయి. ఇక్కడ కూడా డైరెక్టర్‌ శివ కాస్త నిరుత్సాహపరిచారని బాబి డయోల్ అభిమానులు అంటున్నారు.

అయితే తన వంతుగా మాత్రం  నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న కపాల కోన నాయకుడు రుధిర పాత్రకు బాబీ డియోల్‌ పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. ఆ రకంగా ఆయనకు ఇచ్చిన రెమ్యునరేషన్ గిట్టుబాటు అయ్యిందనే చెప్పాలి. 


దర్శకుడు శివ రాసుకున్న కథ చెప్పుకోవాటనికి బాగానే ఉన్నా తెరమీదకు అంత గొప్పగా అయితే రాలేదు. సినిమా ఫస్టాఫ్ సోసోగా ఉంటుంది. సెకండాఫ్ బెస్ట్ అనిపిస్తుంది.

ఇక సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది.  దాంతో  స్క్రీన్ మీద ఉన్న మిగతా  క్యారెక్టర్లు పెద్దగా ప్రయారిటీ లేకుండానే పోయాయి. యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే కామెడీతో విసింగేచేశారనే అన్నారు. 
 

Actor Suriyas starrer Kanguva

 కంగువా సినిమాకు అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా రూ.190 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే దాదాపుగా రూ.200 కోట్ల షేర్‌ రాబట్టాల్సి ఉంది.

అంటే దాదాపుగా రూ.400 కోట్ల గ్రాస్‌ వసూళ్లు నమోదు అయితేనే సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్‌ ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. కంగువా మొదటి రోజు యాభై కోట్లకు అటు ఇటుగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది.  


తెలుగులో ‘కంగువా’ చిత్రానికి రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.3.32 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.  

బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.10.68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసింది. ఈ సినిమా వీకెండ్ రెవిన్యూని బట్టి కొనుక్కున్న వాళ్లు ఏ మేరకు లబ్ది పొందుతారు అనే విషయం తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!