2025 లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లిస్ట్ ఇదే, 30 కోట్ల లోపు బడ్జెట్ తో అరాచకం సృష్టించిన చిత్రాలు

Published : Sep 10, 2025, 09:48 AM IST

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి 2025లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచిన చిత్రాల జాబితా ఈ కథనంలో ఉంది. 

PREV
16
2025 Biggest box office hits

2025 లో ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమకు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని చిత్రాలు అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద రాణించాయి. మరికొన్ని చిత్రాలు నిర్మాతలకు పీడకలగా మిగిలాయి. భారీ బడ్జెట్ లో భారీ అంచనాలతో విడుదలై విజయం సాధించడం వేరు.. తక్కువ బడ్జెట్ లో రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తే ఈ కిక్కు వేరేలా ఉంటుంది. 2025లో తక్కువ బడ్జెట్ లో నిర్మించి వందల కోట్ల వసూళ్లు కురిపించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

26
మహావతార్ నరసింహ 

బడ్జెట్ : రూ.15 కోట్లు, కలెక్షన్స్ : రూ.315 కోట్లు  

మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతారం ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిలిమ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జూలై 25న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టించింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వద్ద 315 కోట్ల వసూళ్లు రాబట్టింది. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఒక యానిమేటెడ్ మూవీ ఈ రేంజ్ లో విధ్వంసం సృష్టించడం ట్రేడ్ విశ్లేషకులని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

36
తుడరుమ్ 

బడ్జెట్ : రూ.35 కోట్లు, కలెక్షన్స్ : రూ.235 కోట్లు  

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ జోరు తగ్గడం లేదు. ఆయన నటించిన తుడరుమ్ చిత్రం సమ్మర్ లో విడుదలై మలయాళీ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ లాల్, శోభన, ప్రకాష్ వర్మ, ఫర్హాన్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. 35 కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం 235 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలన విజయం గా నిలిచింది. 

46
సైయారా 

బడ్జెట్ : రూ.40 కోట్లు, కలెక్షన్స్ : రూ.575 కోట్లు  

వరుసగా బాలీవుడ్ చిత్రాలు డిజాస్టర్ అవుతున్న వేళ.. హిందీ బెల్ట్ లో బాక్సాఫీస్ కి కళ తీసుకువచ్చిన చిత్రం సైయారా. ఇది పెద్ద పెద్ద స్టార్లు నటించిన మూవీ కాదు.. భారీ బడ్జెట్ లో రూపొందించిన యాక్షన్ అడ్వెంచర్ కూడా కాదు. ఆకట్టుకునే రొమాన్స్, భావోద్వేగ సన్నివేశాలతో తెరకెక్కిన చిత్రం ఇది. మోహిత్ సూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 40 కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం హిందీ ఆడియన్స్ ని మాయ చేస్తూ కనీ వినీ ఎరుగని విధంగా ఏకంగా 575 కోట్ల వసూళ్లు రాబట్టింది. సైలెంట్ తుఫాన్ సృష్టించడం అంటే ఇదే. రిలీజ్ అయ్యే వరకు ఇలాంటి చిత్రం ఒకటి వస్తుందని కూడా ఆడియన్స్ కి తెలియదు. మౌత్ టాక్ తోనే అద్భుతమైన వసూళ్లు సాధించింది. 

56
కొత్త లోక చాప్టర్ 1

బడ్జెట్ : రూ.30 కోట్లు, కలెక్షన్స్ : రూ.185 కోట్లు  

సూపర్ హీరో చిత్రాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మలయాళంలో తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ కొత్త లోక చాప్టర్ 1. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు. సూపర్ హీరోగా ఆమె చేసిన విన్యాసాలు ప్రేక్షకులని మైమరపిస్తున్నాయి. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. 30 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు వారాల్లోనే ఈ చిత్రం 185 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

66
సంక్రాంతికి వస్తున్నాం 

బడ్జెట్ : రూ.30 కోట్లు, కలెక్షన్స్ : రూ.185 కోట్లు  

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ కి అసలైన పండుగ కళ తీసుకువచ్చింది. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కలసి చేసిన మ్యాజిక్ ఇది. 50 కోట్ల బడ్జెట్ లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఏకంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో వెంకీ కామెడీ టైమింగ్ .. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లతో కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories