biggboss5ః గట్టిగా ఇరుక్కుపోయిన కాజల్‌.. లహరి కోరికని నాగార్జున తీరుస్తాడా?

Published : Sep 11, 2021, 11:49 PM IST

అత్యుత్సాహానికి పోతే అది బెడిసి కొట్టిందనే సామెతకి ఆర్జే కాజల్‌ ఉదాహరణగా నిలుస్తుంది. హౌజ్‌లో ఆమె అడ్డంగా బుక్‌ అయిపోయింది. మరోవైపు లహరి మాత్రం తనకు సెట్ అయ్యేవాడు లేడంటూ నాగార్జునకే చెప్పేసింది. మరి తన కోరికని నాగ్‌ తీరుస్తాడా?

PREV
16
biggboss5ః గట్టిగా ఇరుక్కుపోయిన కాజల్‌.. లహరి కోరికని నాగార్జున తీరుస్తాడా?

బిగ్‌బాస్‌5 సీజన్‌ మొదటి వారం ముగుస్తుంది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అందరు తమ మధ్య ఉన్న విభేదాలను సెట్‌ చేసుకునే పనిలో పడ్డారు. అనంతరం వచ్చిన నాగార్జున అందరితో మాట్లాడారు. వారు చేసిన మంచి పనులను అభినందించారు. వారిలో వచ్చిన మార్పుని ఆయన ఆహ్వానించాడు. 

26

అనంతరం `సెట్‌, కట్‌` అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఈ వారం రోజుల్లో ఎవరితో కనెక్ట్ అయ్యారు, ఎవరితో కట్‌ అనేది దాని సారాంశం. ఇందులో ఇంటి సభ్యులు తమ కనెక్ట్‌, కట్‌ గురించి నిర్మొహమాటంగా చెప్పారు. అందులో భాగంగా  మొదట విశ్వ..తనకు మానస్‌తో సెట్‌ అయ్యిందని, కాజల్‌తో కట్‌ అని తెలిపారు. కాజల్‌ ఇప్పుడు అందరికి టార్గెట్గా మారింది. 

36

తనకు బెస్ట్ సన్నీ అని, కట్ సరయు అని తెలపగా, ప్రియాంక.. తనకు ప్రియా సెట్‌ అని, కాజల్‌ కట్‌ అని, లోబో..తనకు షణ్ముఖ్‌ సెట్‌ అని, కాజల్‌ కట్ అని, సరయు చెబుతూ తనే సెట్‌ అని, సిరి కట్ అని, శ్వేత.. తనకు అనీ మాస్టర్‌ సెట్‌ అని, ఉమాదేవి కట్‌ అని, శ్రీరామచంద్ర తనకు శ్వేత సెట్‌ అని, కాజల్‌ కట్‌ అని, సిరి తనకు షణ్ముఖ్‌ సెట్‌ అని, సరయు కట్‌ అని, సన్నీ..తనకు హమీద సెట్‌ అని, యాంకర్‌ రవి కట్‌ అని, నటరాజ్‌ మాస్ట్  తనకు లోబో సెట్‌ అని, కాజల్‌ కట్‌ అని తెలిపారు. 

46

ఇక మానస్‌ తనకు రవి సెట్‌ అని, జెస్సీ కట్‌ అని, యాంకర్‌రవి తనకు ప్రియాంక సెట్‌ అని, జెస్సీ కనెక్ట్ అని, ఉమాదేవి తనకు ప్రియాంక సెట్‌ అని, కాజల్‌ కట్‌ అని, హమీద తనకు సరయు సెట్‌ అని, షణ్ముఖ్‌ కట్‌ అని, ప్రియా తనకు అనీ సెట్‌ అని, హమీద కట్‌ అని, ప్రియాంక తనకు ప్రియా సెట్‌ అని, నటరాజ్‌ కట్‌ అని, కాజల్‌ తనకు శ్రీరామచంద్ర సెట్‌ అని, ఉమాదేవి కట్‌ అని, అనీ మాస్టర్‌ తనకు శ్వేత సెట్‌ అని, కాజల్‌ కట్ అని, షణ్ముఖ్‌ తనకు రవి సెట్ అని, హమీద కట్ అని తెలిపారు.

56

మరోవైపు ఎంట్రీతోనే నాగార్జునకి పువ్విచ్చింది ఫిదా చేసింది లహరి. ఇంట్లోకి వచ్చాక కూడా సరైన అబ్బాయిలు లేరని తెలిపింది. తాజాగా ఇదే విజయాన్ని నాగ్‌ ప్రస్తావించారు. ఎవరూతనకు కనెక్ట్ కాలేదని, అందుకే కెమెరాపై పెట్టానని తెలిపింది. అయితే నెక్ట్స్ వీక్‌ ఎవరికో ఒకరికిపువ్వు ఇవ్వాలని నాగ్‌ కోరగా, ఎవరినైనా పంపించండి సర్‌ అని తెలిపింది లహరి. మరి లహరి కోరికని నాగ్‌ తీరుస్తాడా? 

66

ఇందులో ఈ వారం ఎలిమినేషన్‌లో  యాంకర్‌రవి, హమీద సేవ్‌ అయ్యారు. ఎలిమినేషన్‌కి నామినేషన్‌లో ఉన్న యాంకర్‌ రవి, హమీద, సరయు, కాజల్‌, జెస్సీ, మానస్‌లో శనివారం ఇద్దరు సేవ్‌ అయ్యారు. ఇక మిగిలింది కాజల్‌, సరయు, జెస్సీ, మానస్‌. వీరిలో ఫస్ట్ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు సరయు ఎలిమినేట్‌ అయ్యేఛాన్స్ ఉందంటున్నారు. ఆదివారం ఎపిసోడ్‌ మరింత రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తుంది. కచ్చితంగా ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ ఉంటుందని సోషల్‌ మీడియా ద్వారా హింట్‌ అందుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories