స్లిమ్‌ లుక్‌లో షాకిస్తున్న ఖుష్బు.. రెడ్‌ శారీ, కత్తిలాంటి చూపులతో రచ్చ..

Published : Sep 11, 2021, 07:02 PM IST

ఖుష్బు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌. తన అందచందాలతో సౌత్‌ని ఓ ఊపు ఊపేసిన నటి. ప్రస్తుతం సీనియర్‌ నటిగా, రాజకీయ నాయకురాలి రాణిస్తున్న ఖుష్బు ఉన్నట్టుండి షాక్‌ ఇచ్చింది. స్లిమ్‌ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.  

PREV
19
స్లిమ్‌ లుక్‌లో షాకిస్తున్న ఖుష్బు.. రెడ్‌ శారీ, కత్తిలాంటి చూపులతో రచ్చ..

ఖుష్బు.. సినిమాలతోపాటు టీవీ షోస్‌ కూడా చేస్తుంది. అందులో భాగంగా `డాన్స్ వర్సెస్‌ డాన్స్ 2` షోకి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కోసం అందంగా ముస్తాబైంది ఖుష్బు.
 

29

అందులో భాగంగా రెడ్‌ శారీలో మెరిసిపోతుంది ఖుష్బు. కత్తిలాంటి చూపులతో, అదిరిపోయే పోజులతో కుర్రాళ్లకే మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఖుష్బు పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

39

అయితే ఇందులో ఖుష్బు స్లిమ్‌గా కనిపించడం విశేషం. ఇటీవల ఖుష్బు బాగా బరువు తగ్గుతున్నారు. లేటెస్ట్ లుక్‌లో ఆమె మరింతగా స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఖుష్బునేనా ఇలా మారిందనేంతగా ఆమె కొత్త లుక్‌ ఉండట విశేషం. 

49

ఖుష్బు లేట్‌ వయసులో ఇంతటి ఘాటుగా పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పండగా చేసుకుంటున్నారు. ఆమె అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

59

ఖుష్బు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ హీరోయిన్‌గా నటించి స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా మెప్పించింది. 

69

ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారి బలమైన పాత్రలు చేస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తన హుందాతనాన్ని చాటుకుంటుంది ఖుష్బు. అందులో భాగంగా ఇటీవల ఆమె పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `అజ్ఞాతవాసి` చిత్రంలో మెరిసింది. ఇందులో పవన్‌కి తల్లిగా నటించడం విశేషం. ఉన్న కాసేపే అయినా ఆమెదే కీలక పాత్ర కావడం విశేషం. 
 

79

ప్రస్తుతం ఖుష్బు.. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తుంది. శర్వానంద్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇటీవల ఖుష్బు లుక్‌ని కూడా విడుదల చేయగా, అది ఆకట్టుకుంది. 

89

దీంతోపాటు రజనీకాంత్‌తో ఓ సినిమా చేస్తుంది ఖుష్బు. `అన్నాత్తే`లో కీలక పాత్ర పోషిస్తుంది. శివకుమార్‌ దర్శకత్వంలో  ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఇందులో కీర్తిసురేష్‌, నయనతార, మీనా కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

99

వీటితోపాటు టీవీ సీరియల్స్ కూడా చేస్తుంది ఖుష్బు. తమిళంలో పలు సీరియల్స్ లో నటిస్తుంది. మరోవైపు టీవీ షోస్‌తో బిజీగా ఉంటుంది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడీపోయారు. ప్రస్తుతం ఖుష్బు బీజేపీ లీడర్‌గా రాణిస్తున్నారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories