బిగ్‌బాస్ నాల్గో సీజన్లో బాగా పాపులర్ అయ్యింది. రేటింగ్ విషయాలు పక్కన పెడితే, కరోనా,లాక్ డౌన్ కారణంగా చాలా మంది టీవీషోలను బాగా తిలకించారు. ముఖ్యంగా అందులో కంటెస్టెంట్స్ కి మంచి పేరొచ్చింది.
బిగ్‌బాస్ కంటెస్టెంట్ వరుసగా టీవీ షోస్‌లో పాల్గొని హంగామా చేస్తున్నారు. తాజాగా సోహైల్, అఖిల్, మెహబూబ్, నోయల్, లాస్య, హారిక, దివి స్టార్‌మాలోని `స్టార్ మ్యూజిక్` షోలో పాల్గొన్నారు. అది ఈ ఆదివారం ప్రసారమైంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇందులో ఈ కంటెస్టెంట్ చేసిన అల్లరి తెగ వైరల్ అవుతుంది. సుమ..సోహైల్ ఫేమ్ డైలాగ్‌ని పదే పదే రీపీట్ చేసింది. `నేను ఆడా.. నేను చెయ్యా.. `అంటూ నవ్వులు పూయించింది.
మరోవైపు నోయల్, లాస్య, హారిక సోల్‌మేట్స్ అంటూ పంచ్‌లు వేయగా, సోహైల్, అఖిల్, మెహబూబ్‌లను గ్లాస్‌మేట్స్ అంటూ కామెంట్ చేశారు.
అంతేకాదు మీరు గ్లాస్‌లో ఏం కలుపుకుంటారని సుమ అడగ్గా `నేనైతే ప్రేమను కలుపుకుంటాన`ని అఖిల్ చెప్పడంతో సోహైల్ `ఏ కలుపూ.. కలుపూ.. `అంటే చేసిన హంగామా కామెడీనిపించింది.
మరోవైపు పది వేలు వస్తే ఏం చేస్తావని సుమ అడిగితే.. `నేను మా బాబుకి డైపర్స్ ` కొంటా అని చెప్పడం హైలైట్ అయ్యింది.
దీంతోపాటు గ్లామర్ బ్యూటీ దివి తన అందంతో, డాన్స్ లతో కిర్రాక్ పుట్టించింది. షోని రక్తి కట్టించింది.
మొత్తంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఈ ఆదివారం స్టార్‌మాలో నానా రచ్చ చేశారని చెప్పొచ్చు.
ఈ షోలో హారిక హైలైట్‌గా నిలిచింది. ఐటెమ్ భామలా ముస్తాబై అలరించింది.
పాట పాడటమే కాదు, డాన్సు లతోనూ మెప్పించింది. నానా అల్లరి చేసింది.