వైరల్ వీడియో: అర్హ ఎంత అల్లరిపిల్లో... బెండకాయ్, దొండకాయ్ అంటూ బన్నీనే ఆటపట్టించింది!

First Published | Jan 31, 2021, 1:55 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గోదావరి ప్రాంతంలో పుష్ప షూటింగ్ నిరవధికంగా జరుగుతుండగా... ఆయన పాల్గొంటున్నారు. అయితే కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ తన ఫ్యామిలీని బాగా మిస్సవుతున్నట్లు ఉన్నాడు. ముఖ్యంగా క్యూట్ ఏంజెల్ అర్హను ఆయన ఎక్కువుగా గుర్తు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో అర్హ... బెండకాయ్, దొండకాయ్... నువ్వే నా గుండెకాయ్' అంటూ చక్కని వీడియో చేశారు. అర్హ ముద్దు ముద్దు మాటలకు మైమరిచిపోతున్న అల్లు అర్జున్,  మళ్ళి మళ్ళీ చెప్పాలంటూ అర్హను బ్రతిమిలాడు కుంటున్నారు.
సదరు వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన అల్లు అర్జున్ ... ఐ మిస్ యూత్ అర్హ అని కామెంట్ కూడా పెట్టారు.  పిల్లల్ని ఎంతగానో ప్రేమించే అల్లు అర్జున్ సమయం దొరికితే వారితోనే గడుపుతారు.

కొడుకు అయాన్ కంటే కూడా ఆయన అర్హతో ఎక్కువగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.  గతంలో కూడా అల్లు అర్జున్ అర్హతో అనేక వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.
రాములో రాములో సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన హాఫ్ కోట్ స్టెప్ ని, అర్హ దోస స్టెప్ అని ఆటపట్టించిందని ఆయన వీడియోలో చెప్పడం జరిగింది.
ఇక నాన్న చూపించిన అబ్బాయిని చేసుకుంటావా... అని బన్నీ అడిగితే... చేసుకోనని అర్హ చెప్పిన వీడియోని అల్లు అర్జున్ పలుమార్లు మురిసిపోతూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు.
అర్హ పుట్టినరోజు నాడు అంజలి సినిమాలోని అంజలి అంజలి.. అనే సాంగ్ ని అర్హపై షూట్ చేయించి, ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. కర్లీ హెయిర్ తో అర్హ కూడా చాలా క్యూట్ గా బేబీ షామిలీ వలె ఉంటుంది.
ముద్దొచ్చే మాటలు, ఆకట్టుకొనే ఎక్స్ప్రెషన్స్ తో అర్హ చిన్నప్పటి నుండే ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నారు. 2016లో పుట్టిన అర్హ ఐదేళ్లు కూడా నిండకుండానే స్టార్ అయిపోయింది.
2011లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని వివాహం చేసుకోగా వీరికి మొదటి సంతానంగా అబ్బాయి అయాన్ పుట్టాడు. రెండవ సంతానంగా అర్హ పుట్టడం జరిగింది.

Latest Videos

click me!