అమ్మాయిని ప్రేమించినందుకు చావు దెబ్బలు తిన్న అవినాష్‌.. అయ్యో పాపం..

First Published Apr 3, 2021, 9:47 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌, ముక్కు అవినాష్‌ చావు దెబ్బలు తిన్నాడు. అమ్మాయిని ప్రేమించినందుకు ఒళ్లు హూనం చేసుకున్నారు. అమ్మాయి ముందే అందగాడిని అంటూ పోజులివ్వగా ఖైదీలు చితక బాదారు. ఇక అవినాష్‌ గోడు ఆ దేవుడికే తెలియాలి. 
 

జబర్దస్త్ తో పాపులర్‌ అయిన అవినాష్‌ బిగ్‌బాస్‌4లో పాల్గొని మరింతగా పాపులర్‌ అయ్యారు. హౌజ్‌లో తనదైన కామెడీతో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌ రేంజ్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.
undefined
దీంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ఆయన స్టార్‌మాలో కామెడీ స్టార్స్ లో పాల్గొంటూ తనదైన స్కిట్‌లతో అలరిస్తున్నాడు. తాజాగా ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌ ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
undefined
ఇందులో అవినాష్‌ చావు దెబ్బలు తినడం విశేషం. అమ్మాయిని ప్రేమించినందుకు ఆయన్ని చితకబాదారు. అందగాడినంటూ పోజులు కొట్టిన మనోడి ఒళ్లు హూనమయ్యాయి. అక్కడ తూర్పూ, పడమర అనే ప్రాంతాల వారు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరు. వారంతా ఊళ్ల మధ్య తగాదాల్లో కొట్టుకుంటుంటారు.
undefined
అదే సమయంలో అవినాష్‌ హీరోగా రాణిస్తుంటాడు. సెట్‌కి వచ్చిన హీరోయిన్‌పై మనసు పడుతాడు. అయితే అమ్మాయి బాగుందని చెప్పడంతో, అతని అసిస్టెంట్‌ ఇంకా ఎంత మంది కావాల్సి సర్‌ మీకు అనడం ఆద్యంతం నవ్వులు పూయించింది.
undefined
ఆ తర్వాత ఎట్టకేలకు ఆ అమ్మాయిని తన వలలో వేసుకున్నాడు. అమ్మాయి ప్రేమ విషయం మాట్లాడానికి జైలుకి వెళ్తాడు. అమ్మాయికి చెందిన పెద్దలు ఊర్ల మధ్య గొడవల వల్ల జైలుకి వెళతాడు.
undefined
జైలుకెళ్లిన అవినాష్‌ తన ప్రేమ విషయం చెప్పడానికి ముందు, వారి ముందు ఓవరాక్షన్‌ చేస్తాడు. ఓ అందగాడు మీ అమ్మాయిని ప్రేమించాడని చెబుతాడు అవినాష్‌.
undefined
అందుకు జైల్లో ఉన్న వ్యక్తి ఎవరతను అంటే ఆ అందగాడిని నేనే అని చెప్పడంతో వెంటనే చెంప చెల్లుమనిపించాడు అమ్మాయి తండ్రి. వాళ్లమ్మాయిని ప్రేమించినందుకు చితకొట్టాడు తండ్రి. అంతటితో ఆగలేదు, తన తోటి ఖైదీలకు చెప్పి మరీ కొట్టించాడు. వారంతా అవినాష్‌ని రౌండప్‌ చేసి చితకబాదారు.
undefined
దీంతో ఆయన ఒళ్లు హూనమైంది. ఇంకెప్పుడు ఫ్యాక్షన్‌ అమ్మాయిని ప్రేమించనని అక్కడి నుంచి తుర్రుమన్నాడు అవినాష్‌. తాజాగా ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వైరల్‌ అవుతుంది. అయితే ఈ షోలో అవినాష్‌కి జోడిగా అరియానా కనిపిస్తుంటుంది. ఈ సారి మాత్రం మరో అమ్మాయి ఉండటం గమనార్హం.
undefined
click me!