
బిగ్ బాస్ తెలుగు 9 13 వారం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం హౌజ్‌లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ ఆదివారం దివ్య ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని అంతా భావించారు. కానీ సింగిల్ ఎలిమినేషన్‌తోనే సరిపెట్టారు. మరి 13వ వారం డబుల్ ఎలిమినేషన్‌కి వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం నామినేషన్ల ప్రక్రియ క్రేజీగా సాగింది. అందులో భాగంగా సుమన్ శెట్టి నామినేషన్ అత్యంత క్రేజీగా మారింది. ఆయన నామినేషన్ చేసిన పాయింట్‌కి హౌజ్‌లో అంతా నవ్వాపుకోలేకపోయారు.
ఈ వారం నామినేషన్‌లో మొదట ఇమ్మాన్యుయెల్.. రీతూని నామినేట్ చేశాడు. తనని నమ్మానని కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టావని ఆయన చెప్పగా, ఇక్కడో మాట, అక్కడో మాట చెబుతావని కౌంటర్ ఇచ్చింది. సపోర్ట్ చేయలేదని చెప్పింది. పది సార్లు సపోర్ట్ చేసినట్టుగా చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగింది. ఆ తర్వాత డీమాన్ పవన్‌ని నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయెల్. రెబల్ టాస్క్ లో తనని తీసేయడం పట్ల తాను బాధపడినట్టు తెలిపారు. భరణి.. సంజనాని నామినేట్ చేశాడు. ఫ్రాంక్ చేయడాన్ని తప్పుపట్టాడు. మెడిసిన్ తీసుకోవడం పట్ల ఆయన ఫైర్ అయ్యాడు. డీమాన్ పవన్ ని నామినేట్ చేస్తూ, గత పది రోజులుగా పవన్ కనిపించడం లేదని, నీ కోసం నువు గేమ్ ఆడాలని తెలిపారు. ఈ వారం నేను ఫస్ట్ టికెట్ టూ ఫినాలే కొట్టి చూపిస్తా అంటూ సవాల్ చేశాడు పవన్.
రీతూ చౌదరీ.. సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో ఇంకా బాగా ఆడలేదని, లైట్ తీసుకుంటున్నట్టుగా అనిపించిందని తెలిపింది. సంజనాని నామినేట్ చేస్తూ, తనపై చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ బ్యాక్ స్టాంప్ వేశావని నామినేట్ చేసింది. దీంతో ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. అనంతరం తనూజ.. మొదట ఇమ్మాన్యుయెల్‌తో వాదనకు దిగింది. తన కోసం స్టాండ్ తీసుకోలేదని, నువ్వు నా ఫ్రెండ్ అంటూ ఆమె కామెంట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. తన పర్సనల్ విషయాలు షేర్ చేసిన ప్రతిసారి నామినేట్ చేస్తూ వచ్చాడని తెలిపింది. తనకు సపోర్ట్ గా లేవని, స్టాండ్ తీసుకోలేదని చెప్పగా, ప్రతి సారి తాను స్టాండ్ తీసుకున్నా, సపోర్ట్ చేశానని, పైగా నువ్వు ఫ్రెండ్ కాదంటే బాధపడినట్టు ఇమ్మాన్యుయెల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇందులో తనూజ ట్విస్ట్ ఇస్తూ, ఇమ్మాన్యుయెల్‌ని కాకుండా డీమాన్ పవన్‌ని నామినేట్ చేయడం గమనార్హం. దీనికి బిగ్ బాస్ కూడా ఫైర్ అయ్యాడు. డీమాన్ పవన్ ఫైర్ అయ్యాడు. నీ గేమ్ నువ్వు ఆడాలని, ఎవరి కోసమే గేమ్ ఆడటం కరెక్ట్ కాదని, టీమ్‌గా ఆడతానని, రీతూ కోసం ఆడటాన్ని ఆమె తప్పుపట్టింది. ఆ తర్వాత సంజనాని నామినేట్ చేసింది తనూజ. సుమన్ శెట్టి.. రీతూని నామినేట్ చేస్తూ, నామినేషన్ లేవు, ఈ సారి నామినేషన్‌లో ఉండు అని చెప్పాడు, అదే సమయంలో బాగా అరుస్తున్నావ్, తగ్గించుకో అని తెలిపాడు. దీనికి అంతా నవ్వారు. ఇంతలో మరో షాక్ ఇచ్చాడు సుమన్ శెట్టి. డీమాన్ పవన్‌ని నామినేట్ చేస్తూ నీ హెల్త్ బాగా లేదు, నువ్వు ఇప్పుడు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకో, నీకు రెస్ట్ అవసరం అని నామినేట్ చేయడం గమనార్హం. దీంతో హౌజ్ మేట్స్ నవ్వాపుకోలేదు.
మరోవైపు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలని, నువ్వే టికెట్ ఫినాలే కొడితే మిగిలిన వాళ్లు కొట్టారా? అంటూ పవన్‌ని నామినేట్ చేసింది సంజనా. అలాగే, సారీ చెప్పినా తనని నామినేట్ చేస్తున్నారని రీతూని నామినేట్ చేసింది సంజనా. ఇంకోవైపు డీమాన్ పవన్.. తనూజ, సంజనాలను నామినేట్ చేశాడు. అయితే అందరు నామినేషన్‌లో ఉంటే బెటర్ అని చెప్పిన ఇమ్మాన్యుయెల్‌ని నామినేట్ చేయగా, అంతా నవ్వుకున్నారు. దీంతో సంజనాని నామినేట్ చేశాడు పవన్. ఇది కూడా క్రేజీగా అనిపించింది.
ఫైనల్‌గా కెప్టెన్ కళ్యాణ్ ఒక నామినేషన్ అధికారం ఇవ్వడంతో నామినేషన్‌లో లేని భరణిని నామినేట్ చేశాడు. దీంతో 13వ వారం సంజన, రీతూచౌదరీ, పవన్, సుమన్ శెట్టి, తనూజ, భరణి నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి.