శ్రీరామ్‌ నా గుండెల్లో ఉంటాడు.. షో తర్వాత కూడా మా రిలేషన్‌ కంటిన్యూ అవుతుంది.. బిగ్‌బాస్‌5 హమీద బోల్డ్ కామెంట్

First Published | Oct 13, 2021, 4:30 PM IST

బిగ్‌బాస్‌5 షోలో ఐదు వారలపాటు అలరించింది హమీద. గత వారం అనూహ్యంగా ఎలిమినేట్‌ అయి అందరిని షాక్‌కి గురి చేసింది. తనకి కూడా మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట. ఈ నేపథ్యంలో హౌజ్‌లోని ఆసక్తికర విషయాలను, శ్రీరామ్‌తో రిలేషన్‌ గురించి బోల్డ్ గా చెప్పి షాకిచ్చింది హమీద.

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో సింగర్‌ శ్రీరామచంద్రతో లవ్‌ స్టోరీ నడిపించి స్పెషల్‌ అటెన్షన్‌ని క్రియేట్‌ చేసుకుంది హమీద. క్యూట్‌ అందంతో, ముద్దు ముద్దు మాటలతో టీవీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. ప్రారంభం నుంచి తనదైన స్టయిల్‌లో గేమ్‌ ఆడుతూ మెప్పించింది. కానీ చివరల్లో ఆమె ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. హౌజ్‌ మేట్స్ కూడా ఇదే విషయాన్ని ఆమెకి చెబుతూ నామినేట్‌ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఐదో వారంలో హమీద ఎలిమినేట్‌ అయ్యింది.

తాను ఎలిమినేట్‌ అవుతాననే విషయం తాను ఊహించలేదని, మైండ్‌ బ్లాంక్‌ అయిన ఫీలింగ్ కలిగిందని తెలిపింది హమీద. అయితే తనపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకి థ్యాంక్స్ చెప్పింది. అందుకోసం థ్యాంక్స్ మీట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో హమీద హౌజ్‌లో జరిగిన విషయాలను, శ్రీరామ్‌తో రిలేషన్‌, నాగార్జున కాంప్లిమెంట్స్ వంటి వాటి గురించి `ఏషియా నెట్‌` తెలుగుతో ప్రత్యేకంగా పంచుకుంది. అనేక ఆసక్తికర విషయాలను అంతే బోల్డ్ గా చెప్పింది హమీద. 
 


బిగ్‌బాస్‌5 నుంచి బయటకు రావడం చాలా బాధగా ఉందని చెప్పిన హమీద..హౌజ్‌లోకి వెళ్లాక చాలా విషయాలు నేర్చుకున్నట్టు తెలిపింది. పర్సనల్‌గా, కెరీర్‌ పరంగా బిగ్‌బాస్‌5 ఎంతో హెల్ప్ అయ్యిందని, అంతకు ముందు తానెవరో ఎవరికీ తెలియదని, ఇప్పుడు అందరు అభినందిస్తున్నారు, అభిమానిస్తున్నారు. తమ ప్రేమని పంచుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తనని అప్రిషియేట్‌ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. `బిగ్‌బాస్‌5` తనకు పెద్ద ప్లాట్‌ఫామ్‌నిచ్చిందని చెప్పింది. 

హౌజ్‌లో తాను అందరితో బాగా ఉన్నానని, తర్వాత వాళ్లు ఆడుతున్న గేమ్‌ని బట్టి, వాళ్లు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి సైలెంట్‌ అయ్యానని తెలిపింది. ఫిజికల్‌ టాస్క్ లో కాకుండా మిగిలిన అన్నిటాస్క్ ల్లో తాను చాలా బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసినట్టు తెలిపింది. అయితే షోలో బిగ్‌బాస్‌ గేమ్‌ ప్లాన్‌గానీ, స్ట్రాటజీగానీ ఏమీ ఉండదని, ఏదైనా అప్పటికప్పుడు అనుకుని ఆడేదిగానే ఉంటుందని, అందులో ఫేక్‌ అనే మాటకి ఆస్కారం లేదని తెలిపింది. అంతా జెన్యూన్‌గానే ఉంటారని తెలిపింది. 
 

ఐదో వారం తర్వాత తాను బాగా గేమ్లో పార్టిసిపేట్‌ చేయాలని, యాక్టివ్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. కానీ ఇంతలోనే ఎలిమినేట్ కావడం చాలా బాధగా ఉందని చెప్పింది. అయితే తనకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడమే సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందని, అదే మాదిరిగా ఎలిమినేషన్‌ కూడా అలాంటి సర్‌ప్రైజింగ్‌గా లాగే అనిపించిందని చెప్పింది.
 

తాను ఎలిమినేట్‌ అని నాగార్జున అన్నప్పుడు తన మైండ్‌ బ్లాంక్‌ అయిపోయిందని, ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదని తెలిపింది. కానీ తాను ఆడాల్సింది చాలా ఉందని, ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని ఆవేదన చెందింది. 
 

శ్రీరామ్‌ గురించి చెబుతూ, ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ బాగా కుదిరిందని, అందుకే బాగా కనెక్ట్ అయ్యామని తెలిపింది. ఆయన తనని బాగా అర్థం చేసుకుంటాడని, బాగా టేక్‌ కేర్‌ చేస్తాడని చెప్పింది. ఏ విషయమైనా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడని, బిగ్‌బాస్‌5 విన్నర్‌ అయ్యే అవకాశాలున్నాయని చెప్పింది హమీద. తన సపోర్ట్ ఆయనకే ఉంటుందని, ఆ తర్వాత రవి అన్న తనకిష్టమని చెప్పింది. వచ్చేటప్పుడు ఆయనకిచిన్న గిఫ్ట్ కూడా ఇచ్చానని, అలాగే శ్రీరామ్‌కి సైతం గిఫ్ట్ ఇచ్చానని చెప్పింది. 

శ్రీరామ్‌తో ఉన్న బాండింగ్‌ ఫ్రెండ్‌షిప్‌ అని చెప్పలేను, ప్రేమ అని కూడా డిఫైన్‌ చేయలేనని తెలిపింది. అలాగని ప్రేమ కాదని కూడా అనలేనని, తమది ఒక డిఫరెంట్‌ బాండింగ్‌ అని చెప్పింది. ఆయన తన గుండెలో ఉంటాడని తెలిపింది. బిగ్‌బాస్‌ తర్వాత కూడా తమ బాండింగ్‌ కంటిన్యూ అవుతుందని పేర్కొంది హమీద. హౌజ్‌లో శ్రీరామ్‌తో రిలేషన్‌కి సంబంధించి తమ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారని, తమ మధ్య బాండింగ్‌ని వాళ్లు కూడా అర్థం చేసుకున్నారని, పాజిటివ్‌గానే స్వీకరించారని చెప్పింది హమీద. 
 

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక ఆడియెన్స్ నుంచి సన్నిహితుల నుంచి లభిస్తున్న ప్రేమ ఊహించని విధంగా ఉందని, ప్రస్తుతం ఆ ప్రేమలో మునిగి తేలుతున్నట్టు చెప్పింది. ప్రస్తుతం సినిమా ప్రాజెక్ట్ లు కూడా వస్తున్నాయని తెలిపింది. రెండు మూడు ప్రాజెక్ట్ లు వర్క్‌ అవుతున్నాయని, దీన్నుంచి బయటపడ్డాక కొత్త ప్రాజెక్ట్ లపై ఫోకస్‌ పెడతానని తెలిపింది. 

నాగార్జున తనన హీరోయిన్‌ అని, ఏంజెల్‌ అని ప్రశంసించడం చాలా హ్యాపీగా ఉందని, గాల్లో తేలిన ఫీలింగ్‌ కలుగుతుందని తెలిపింది. నాగ్‌ తనకు షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చాడని, అది అన్నిటి కంటే చాలా విలువైనదని, దాన్ని ఎప్పటికీ వదులుకోలేదనని తెలిపింది. తనకు లభించిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పింది హమీద. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌కి, నాగార్జునకి థ్యాంక్స్ చెప్పింది. 
 

Latest Videos

click me!