ముండమోసినట్లు ఏడుస్తున్నారు.. అనసూయ ఓటమి, ప్రకాష్ రాజ్ ప్యానల్ వైఖరిపై నరేష్ హాట్ కామెంట్స్

First Published | Oct 13, 2021, 2:14 PM IST

'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించిన విష్ణు 'మా'కి కొత్త ప్రెసిడెంట్ గా అవతరించిన సంగతి తెలిసిందే.

'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించిన విష్ణు 'మా'కి కొత్త ప్రెసిడెంట్ గా అవతరించిన సంగతి తెలిసిందే. వివాదాలు, వాదనలు, పరస్పర ఆరోపణల తర్వాత అక్టోబర్ 10న ఉద్రిక్తకర పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో విష్ణు ప్యానల్ విజయం సాధించింది. గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ప్రకాష్ రాజ్ కు ఓటమి తప్పలేదు. 

నేడు Manchu Vishnu అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడంతో నరేష్ మీడియాతో మాట్లాడారు. విష్ణు విజయంలో నరేష్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. విష్ణు విజయం కోసం Naresh ఏకంగా 800 మంది సభ్యులకు ఫోన్ చేసి మద్దతు కూడగట్టారు. నేడు నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడిగా ప్రకాష్ రాజ్ ప్యానల్ మా సభ్యత్వానికి రాజీనామా చేయడంపై నరేష్ స్పందించారు. 

Latest Videos


MAA ఆఫీస్ తో నాకు 6 ఏళ్ల అనుంబంధం ఉంది. గతంలో చెప్పినట్లుగా నేను ఒక్కసారే పోటీ చేస్తాను. ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. నేడు విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. సో ఆఫీస్ లో ఇవే నా చివరి క్షణాలు. సంతోషంతో ఆనందభాష్పాలు వస్తున్నాయి. మా కార్యక్రమాల్లో పాల్గొంటాను. అవసరమైనప్పుడు నాలో కృష్ణుడు బయటకు వస్తాడు. 

manchu vishnu

ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం గురించి మాట్లాడుతూ.. సభ్యులు ఎవరిని కావాలో వారినే గెలిపించుకున్నారు. ఇక గొడవ ఎందుకు? మా అనేది ఒక కుటుంబం అని భావించని వాళ్లే ఇలా చేస్తారు. రిజైన్ చేసిన వాళ్ళ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుంది. ఓడినా గెలిచినా కలసి పనిచేస్తాం అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? మాటమీద నిలబడాలి కదా. మోడీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశం విడిచి వెళ్లిపోయిందా అని నరేష్ ప్రశ్నించారు. పాత విషయాలని బయటకు తీసి ఎమోషనల్ గేమ్ అదొద్దు అని నరేష్ సూచించారు. 

ఇక Anasuya ఓటమి గురించి కూడా నరేష్ స్పందించారు. రాత్రేమో అనసూయ గెలిచినట్లు ప్రకటించారు.. కానీ ఉదయం ఓటమి అని ప్రకటించారు. ఎన్నికలతో పాటు కౌంటింగ్ కూడా సరిగ్గా జరగలేదు అని అనసూయ కామెంట్స్ చేయడంపై నరేష్ మాట్లాడారు. కౌంటింగ్ టేబుల్ వద్ద అఫీషియల్ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఇక అక్కడ అవకతవకలకు ఆస్కారం ఎక్కడ ఉంది అని నరేష్ అన్నారు. అయినా ఓటమి చెందితే ఎందుకు ముండమోసినట్లు ఏడుస్తున్నారు. మగవాళ్ళు కూడా అలాగే ఏడుస్తున్నారు అంటూ నరేష్ ఘాటు కామెంట్స్ చేశారు. 

అతిగా ఏడ్చే మగవాళ్ళని నమ్మొద్దు అని నరేష్ సూచించారు. విష్ణుని ఎవరూ డిస్ట్రబ్ చేయవద్దు. అతడిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. ఎమోషన్స్ రైజ్ చేయవద్దు అని నరేష్ అన్నారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు నరేష్ పై సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు మంచి వ్యక్తే..కానీ నరేష్ తోనే సమస్య వస్తోంది అంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరిగే సమయంలో నరేష్ బూతులతో రెచ్చిపోయాడు అంటూ ఉత్తేజ్ కామెంట్స్ చేశాడు. 

click me!