అమ్మకు అరుదైన కానుక ఇచ్చిన పల్లవి ప్రశాంత్... దాని విలువ ఎన్ని లక్షలో తెలుసా?

Published : May 10, 2024, 05:39 PM IST

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తన తల్లికి అరుదైన బహుమతి ఇచ్చాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.   

PREV
16
అమ్మకు అరుదైన కానుక ఇచ్చిన పల్లవి ప్రశాంత్... దాని విలువ ఎన్ని లక్షలో తెలుసా?
Pallavi Prashanth


బిగ్ బాస్ సీజన్ 7 లో సంచలనం నమోదు అయ్యింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ కప్పు గెలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 

26
Pallavi Prashanth - Sivaji

బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ కాగా... ప్రిన్స్ యావర్ 4వ స్థానంలో రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు. దాంతో పల్లవి ప్రశాంత్ పొందాల్సిన ప్రైజ్ మనీ తగ్గింది. నగదు బహుమతితో పాటు ఒక కారు, నెక్లెస్ కూడా ఇచ్చారు. 

36
Bigg Boss Telugu 7


మారుతీ సుజుకీ బ్రీజా కారు ధర రూ. 15 లక్షలు. నెక్లెస్ ధర కూడా రూ. 15 లక్ష్లలు. ఈ బహుమతులు పల్లవి ప్రశాంత్ కి వెంటనే ఇవ్వలేదు. షో ముగిసిన ఐదు నెలలకు జాన్ అలుకాస్ ప్రకటించిన నెక్లెస్ పల్లవి ప్రశాంత్ కి అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పల్లవి ప్రశాంత్ తెలియజేశాడు. 

46
Pallavi Prashanth

జాస్ అలుకాస్ షో రూమ్ కి వెళ్లిన పల్లవి ప్రశాంత్ నెక్లెస్ తీసుకున్నాడు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టి అమ్మకు మొదటి కానుక... అని కామెంట్ పెట్టాడు. బిగ్ బాస్ షోలోనే ఈ నగ అమ్మ కోసం అని పల్లవి ప్రశాంత్ వెల్లడించిన విషయం తెలిసిందే. 

56
Pallavi Prashanth

కాగా బహుమతులు కాకుండా ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు పేద రైతులకు పంచుతానని పల్లవి ప్రశాంత్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. టాక్స్ కటింగ్స్ పోను పల్లవి ప్రశాంత్ కి రూ. 16 లక్షలు వస్తాయట. ఈ మొత్తం పల్లవి ప్రశాంత్ పేద రైతులకు దానం చేయాల్సి ఉంది. 

 

66
Pallavi Prashanth

అయితే ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ ఒక్క లక్ష రూపాయలు మాత్రమే పంచాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అనాథ బాలల పేరిట రూ. 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అలాగే ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. ఇది జరిగి రెండు నెలలు అవుతుంది. పల్లవి ప్రశాంత్ మరొక సాయం చేయలేదు. 

click me!

Recommended Stories