ఆ విషయంలో బయటపడ్డ పల్లవి ప్రశాంత్ మోసం... రైతుబిడ్డ ముసుగులో ఇలాంటి పనులా?

First Published Apr 2, 2024, 12:08 PM IST


బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా తన హామీ నెరవేర్చలేదు. అయితే ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ చేసిన మోసం తెరపైకి వచ్చింది. 
 

Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక హామీ ఇచ్చాడు. టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీతో ఏం చేస్తావని హోస్ట్ నాగార్జున అడిగారు. నేను విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు సహాయంగా అందిస్తానని చెప్పాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఇచ్చిన ఈ హామీ అతని విజయానికి దోహదం చేసింది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

Pallavi Prashanth

విన్నర్ గా టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. కాబట్టి హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు పేదల రైతులకు పంచాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన మూడు నెలలు అవుతుంది. ఆ దిశగా పల్లవి ప్రశాంత్ అడుగులు వేసిన దాఖలాలు లేవు. 
 

Pallavi Prashanth

దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో సీజన్ 2 విన్నర్ ప్రైజ్ మనీ క్యాన్సర్ రోగులకు సహాయంగా ఇస్తానని చెప్పాడు. ఆయన మాట నిలబెట్టుకోలేదనే వాదన ఉంది. పల్లవి ప్రశాంత్ కూడా మాట తప్పాడు. ఇంకెప్పుడు సహాయం చేస్తాడని విమర్శలు వినిపించాయి. ప్రాణం పోయినా మాట తప్పను. త్వరలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తానని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో స్పందించాడు. 

అన్న మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఓ పేద రైతు కుటుంబానికి అండగా నిలిచాడు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొలుగూరు గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి రూ. 1 లక్ష సహాయం చేశాడు. పేద రైతు, అతని భార్య మరణించడంతో పిల్లలు అనాథలు అయ్యారు. పిల్లల పేరిట లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఒక ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. 

Pallavi Prashanth

అయితే పల్లవి ప్రశాంత్ మరో సహాయం చేయలేదు. లక్ష రూపాయలు పంచి సైలెంట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ లక్ష రూపాయలు దానం చేసి రెండు వారాలుగా పైగా అవుతుంది. ఇంకొంత మందికి సహాయం చేసి వీడియో అప్లోడ్ చేస్తానన్న పల్లవి ప్రశాంత్ అది చేయలేదు. 

పల్లవి ప్రశాంత్ దాదాపు  రూ. 10 లక్షలు పంచాల్సి ఉంది, కానీ ఇంత వరకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే దానం చేసినట్లు వీడియో చేశాడు. పేద రైతులను గుర్తించడం పల్లవి ప్రశాంత్ కి అంత కష్టం అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల సహాయం కోసం నా ఇంటికి రావొద్దని పల్లవి ప్రశాంత్ వీడియో పోస్ట్ చేశాడు. చూస్తుంటే పల్లవి ప్రశాంత్ అరకొరగా ఈ కార్యక్రమం పూర్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి.. 

click me!