
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. కానీ దానికంటే ముందే ఇప్పుడు `బిగ్ బాస్ అగ్నిపరీక్ష` పేరుతో కామన్ మ్యాన్ కంటెస్టెంట్లని ఎంపిక చేస్తున్నారు. ఇందులో 45 మందిని ఫిల్టర్ చేసి, వారిలోనుంచి ఐదుగురుని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష రన్ అవుతుంది. ఇందులో కామన్ మ్యాన్ కంటెస్టెంట్లని జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న నవదీప్, అభిజీత్, బిందుమాధవి కలిసి ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 5న ఇది ఫైనల్ కాబోతుంది.
ప్రస్తుతం నడుస్తున్న `బిగ్ బాస్ అగ్నిపరీక్ష`కి ఆడియెన్స్ నుంచి నెగటివ్ రియాక్షన్ వినిపిస్తోంది. ఏమాత్రం రసవత్తరంగా లేదని అంటున్నారు. చాలా వింతగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష ప్రారంభానికి ముందు చాలా హడావుడి జరిగింది. మామూలుగా ఉండదు, చాలా టఫ్‌గా ఉంటుందంటూ ప్రోమోల్లో నవదీప్, అభిజీత్ తెలిపారు. కానీ తీరా షో మాత్రం చప్పగా సాగుతుందంటున్నారు. అదే సమయంలో కామన్ మ్యాన్ అంటే యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వారిలో చాలా వరకు అలాంటి వాళ్లే కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్ల నుంచి విభిన్నమైన వాదన వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోకి సంబంధించిన ఒక షాకింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సారి బిగ్ బాస్ మారిపోయాడనే కామెంట్ వినిపిస్తోంది. ఇటీవల బిగ్‌బాస్ ప్రోమోస్‌లో బిగ్ బాస్ గా కొత్త వాయిస్ వినిపించింది. గతంతో పోల్చితే కొత్త వ్యక్తి చెప్పినట్టుగా ఉంది. అదే సమయంలో వాయిస్‌లో గాంభీర్యం మిస్ అయ్యింది. బిగ్ బాస్ అన ఫీల్ రావడం లేదు. దీంతో ఇది ట్రోల్స్ కి గురయ్యింది. షోపై ఆసక్తి తగ్గిపోతుంది. దీనికితోడు ఈ సీజన్‌కి అసలు బిగ్ బాస్ మారిపోయాడనే ప్రచారం జరుగుతుంది. కొత్త వ్యక్తి వాయిస్ చెప్పబోతున్నట్టుగా వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. కేవలం ఈ అగ్నిపరీక్ష ప్రోమోస్ వరకే కొత్త వాయిస్ ఉంటుందని, రెగ్యూలర్ షోకి పాత వాయిసే ఉంటుందని సమాచారం. ఏది నిజమో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. షోకి బజ్ తగ్గిపోయింది.
మరి ఇంతకి బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ కి వాయిస్ ఇచ్చేది ఎవరు? అనేది చూస్తే, అదొక డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్. పేరు రాధాకృష్ణ. ఆయన అసలు పేరు రేణుకుంట్ల శంకర్. తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పట్నుంచి ఆయనే బిగ్ బాస్ గా వాయిస్ అందిస్తున్నారు. చాలా గాంభీర్యంతో కూడిన ఆయన వాయిస్ షోకి వన్నే తీసుకొచ్చింది. ఈ షోకి బిగ్ బాస్ వాయిసే బలం. అది ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ వాయిస్‌కి చాలా మంది ఫ్యాన్స్ కూడా పుట్టుకొచ్చారు. తనదైన గాంభీర్యమైన స్వరంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఆదేశాలిస్తూ ఆకట్టుకుంటున్నారు రాధాకృష్ణ. ఆయన్ని ఇప్పుడు మార్చేశారనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రన్ అవుతున్న `బిగ్ బాస్ అగ్నిపరీక్ష`కి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. నోటెడ్ ఆర్టిస్ట్ లు లేకపోవడంతో నెటిజన్లు పట్టించుకోవడం లేదు. ఇది వచ్చే మెయిన్ షోపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరి సుమారు ఐదుగురుని ఎంపిక చేసి, రెగ్యూలర్ సెలబ్రిటీ కోటాలో మరో 15-17 మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. ఈ సారి సుమారు 22 మంది కంటెస్టెంట్లకి ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే వీరిలో కొందరిని వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారం తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న ప్రారంభం కాబోతుంది. సమాచారం.