ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డాన్స్ కి ఇన్‌స్పైర్‌ అయి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి ఎవరో తెలుసా?

Published : Aug 25, 2025, 08:50 PM IST

ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డాన్సర్‌ అనే విషయం తెలిసిందే. ఆయనలోని ఆ డాన్స్ తో ఇన్‌స్పైర్‌ అయి ఒక అమ్మాయి తల్లి తన కూతురుని బెస్ట్ డాన్సర్‌ని చేసింది. ఆమె ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. 

PREV
15
కూచిపూడి డాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్‌

జూ ఎన్టీఆర్‌ చిన్నప్పుడు క్లాసికల్‌ డాన్స్ నేర్చుకున్నారు. కూచిపూడి డాన్స్ లో మంచి పట్టు ఉంది. అనేక స్టేజ్‌ షోస్‌ కూడా ఇచ్చి మెప్పించారు. తారక్‌ని చిన్నప్పుడు ఓ సాధారణ అబ్బాయిగానే పెంచింది వాళ్ల అమ్మ. అలానే ట్రీట్‌ చేసింది.  చదువు విషయంలో కూడా అలానే ట్రీట్‌ చేసింది. తారక్‌ చాలా అల్లరివాడు. ఆ అల్లరిని కంట్రోల్‌ చేసేందుకు కర్రలు విరిగేలా అమ్మ తనని కొట్టిందని పలు సందర్భాల్లో ఎన్టీఆర్‌ చెప్పారు. చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు అంతే గొప్పగా ఎదిగారు తారక్‌. డాన్సుల్లో టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్‌గా పేరుతెచ్చుకున్నారు.

DID YOU KNOW ?
హృతిక్‌ ఫేవరేట్‌ డాన్సర్‌
ఎన్టీఆర్‌కి ఇండియన్‌ సినిమాలో హృతిక్‌ రోషన్‌ తన ఫేవరేట్‌ డాన్సర్‌. వీరిద్దరు కలిసి ఇప్పడు `వార్‌ 2`లో నటించిన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి `సలామ్‌ అనాలి` అనే పాటలో డాన్సు కూడా చేశారు.
25
ఎన్టీఆర్‌ డాన్స్ తో ఇన్‌స్పైర్ అయిన హీరోయిన్‌ తల్లి

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ చిన్నప్పుడు క్లాసికల్‌ డాన్స్ షో చేసే సమయంలో ఒక హీరోయిన్‌ మదర్‌.. తారక్‌ని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యింది. తాను కూడా తనకు కూతురు పుడితే ఇలా డాన్సర్‌ని చేయాలని కలలు కన్నది. అప్పుడు ఎన్టీఆర్‌ కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడు అదే చేసి చూపించింది. తన కూతురుని బెస్ట్ డాన్సర్‌ గా తీర్చిదిద్దింది. ఇప్పుడు ఆ అమ్మాయి టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమె ఎవరో కాదు శ్రీలీల.

35
జగపతిబాబు షోలో సందడి చేసిన శ్రీలీల, వాళ్ల అమ్మ

శ్రీలీల తల్లి స్వర్ణలత తారక్‌ని చూసి తనకు కూతురుపుడితే మీలా బెస్ట్ డాన్సర్‌ని చేయాలని ఫిక్స్ అయ్యిందట. ఈ విషయాన్ని జగపతిబాబు హోస్ట్ గా చేస్తోన్న `జయమ్ము నిశ్చయమ్మురా` టాక్‌ షోలో తెలిపారు. శ్రీలీల, వాళ్ల మదర్‌ స్వర్ణలత కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఇందులో జగపతిబాబు..ఎన్టీఆర్‌ చిన్నప్పుడు డాన్స్ పర్‌ఫెర్మెన్స్ చేస్తోన్న ఒక ఫోటోని చూపించి, ఈ ఫోటో గురించి ఏమైనా చెబుతారా? అని శ్రీలీల అమ్మని అడిగారు.

45
తానాలో ఎన్టీఆర్‌ డాన్స్.. శ్రీలీల తల్లి అప్పుడే ఫిక్స్

ఆమె రియాక్ట్ అవుతూ, 1997లో తానా ఈవెంట్స్ లాస్‌ ఏంజెల్స్ లో జరిగాయి. అక్కడ తాము ఉండేవాళ్లం. ఆ సమయంలో ఈ తానా ఈవెంట్‌కి వెళ్లాం. అందులో ఎన్టీఆర్‌ డాన్స్ చేశారు. ఆయన కలిసినప్పుడు నాకు అమ్మాయి పుడితే నీలా డాన్స్ చేయించాలని కోరిక ఉంది అని చెప్పాను.  అదే కోరికని బలంగా దాచుకుని ఇప్పుడు శ్రీలీలని తయారు చేశాన`ని తెలిపింది స్వర్ణలత. శ్రీలీలకి క్లాసికల్‌ డాన్స్ లతోపాటు వీణ వాయించడం వచ్చు. ఇప్పుడు డ్రమ్స్, గీటార్‌ నేర్చుకుంటుందట. చిన్నప్పుడు భరతనాట్యంతోపాటు బాలిలో కూడా చేర్చించిందట. ఈ రెండూ ఒకేసారి నేర్చుకుందట శ్రీలీల. ఆ సమయంలో కష్టమైనా, సాధన చేస్తే పెద్ద సమస్యకాదని చెప్పి నేర్పించానని,  శ్రీలీల కూడా అంతే బాగా నేర్చుకుందని, ఇప్పుడు బెస్ట్ డాన్సర్‌ అయ్యిందని తెలిపింది స్వర్ణలత.

55
తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల

`పెళ్లిసందడి` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..`ధమాఖా` తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంది. `గుంటూరు కారం`, `స్కంధ`, `ఆదికేశవ`, `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌`, `భగవంత్‌ కేసరి`, `రాబిన్‌హుడ్‌`, `జూనియర్‌` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. `పుష్ప 2`లో కిస్సిక్‌ సాంగ్‌తో దుమ్ములేపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకి ఇప్పుడు ఇంతర భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. హిందీలో `అషిఖీ 3`లో హీరోయిన్‌గా ఎంపికైంది. తమిళంలో `పరాశక్తి` మూవీలోనూ నటిస్తోంది. ఇక తెలుగులో `మాస్‌ జాతర`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీలీల.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories