బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఈ వారం డబుల్ఎలిమినేషన్ కు బలైపోయాడు పృథ్వీరాజ్ శెట్టి బిగ్ బాస్ టీమ్ అతనికి అన్యాయం చేసిందని చెప్పుకోవాలి. అది కూడా అవినాశ్ కోసం పృధ్వీని బలిచేసినట్టు తెలుస్తోంది. ఈవారం డబుల్ఎలిమినేషన్ లో భాగంగా శనివారం ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోగా.. ఆదివారం ఎపిసోడ్ లో పృధ్వీరాజ్ బయటకు వచ్చేశాడు.
Also Read: టేస్టీ తేజకు షాకింగ్ రెమ్యునరేషన్, 8 వారాలకి అంత వసూలు చేశాడా..?
పృథ్వీరాజ్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ టీమ్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హౌస్ లో పులిలా ఆడిన పృధ్వీరాజ్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు. హౌస్ లో ప్రతీ టాస్క్ ను ప్రాణం పెట్టి ఆడాడు పృధ్వీరాజ్. కాని అతని షార్ట్ టెంపర్ కారణంగా ఆ తన ఆటను పక్కన పెట్టి.. అతని బలహీనతను సాకుగాచూపి తొక్కేయాలని చాలామంది ప్రయత్నం చేశారు.
కాని ఎక్కడా కాస్త కూడా బెదరకుండా, ఎక్కడా భయపడకుండా ఏమాత్రంలూజ్ అవ్వకుండా గట్టిగా ఆడాడు పృథ్వీరాజ్. అయితే ఎంత ఆడినా లక్ కూడా కలిసిరావాలి.అతనికి అదృష్టం కలిసిరాలేదు. దాదాపు 13 వారాలు అతని జన్యూన్ క్యారెక్టర్ చూసి ఓట్లు వేస్తూ వచ్చారు జనాలు. ఎప్పటికప్పుడు పృధ్వీరాజ్ ను సేవ్ చేస్తూ వచ్చారు. కాని అతను ఎంత బాగా టాస్క్ లు ఆడినా.. బిగ్ బాస్ లో ఒక్క సారి కూడా మెగా చీఫ్ అవ్వలేకపోయాడు.
Also Read: చిరంజీవికి చెల్లెలు.. బాలయ్య హీరోయిన్.. సినిమాలకు దూరంగా ఉంటున్న నటి ఎవరో తెలుసా..?
Prithviraj Shetty
పృథ్వీరాజ్ గట్టిగా ఆడిన సందర్భంలో కూడా అతని ఆట వల్ల చీఫ్ లు అయిన వారు చాలామంది ఉన్నారు. కాని వారు పృధ్వీరాజ్ పై కృతజ్ఞత చూపించలేకపోయారు. చివరకు శనివారం ఎపిసోడ్ లో కూడా నిఖిల్, విష్ణు ప్రియా పృధ్వీరాజ్ కు వెన్నుపోటు పొడిచారు. నబిల్ ను దుమ్మురేపే కంటెస్టెంట్ గా సెలక్ట్ చేశారు కాని పృథ్వీరాజ్ ఆటను మెచ్చుకోలేదు. కాని పృధ్వీమాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళాడు.
Also Read: ఒక ఏడాదిలో 35 సినిమాల్లో నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు!
Bigg boss telugu 8
ఎక్కడా ఫేక్ చూపించలేదు. తాను ఎలా ఉ న్నాడో అలానేఉన్నాయి. అలా ఉండబట్టే 13 వారాలు సేవ్ అవుతూ వచ్చాడు. విష్ణు ప్రియ విషయంలో కూడా తాను డైరెక్ట్ గా ఉన్నది చెప్పేశాడు. అంతే కాదు ప్రతీ నామినేషన్ లో తనను నామినేట్ చేస్తున్నా..అవతలివారికి తన పాయింట్ లో మాట రాకుండా చేయడంలో పృధ్వీరాజ్ రూట్ వేరు. కరెక్ట్ పాయింట్ తో వారి నామినేషన్ కు వాల్యూ లేకుండా చేస్తాడు పృధ్వీరాజ్. అయితే ఈసారి కూడా అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు.
Also Read: హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏకైకా తెలుగు సీరియల్ ఏదో తెలుసా..?
Bigg boss telugu 8
ఓటింగ్ లో కూడా టేస్టీ తేజ , అవినాష్ లకు తక్కువ ఓట్లు వచ్చాయి. కాని అవినాష్ టికెట్ టుఫినాలే రేసులోకి వెళ్లడం.. విన్ అవ్వడంతో ఎలిమినేషన్ నుంచి అవినాశ్ తప్పించుకున్నాడు. టేస్టీ తేజ తరువాత వెళ్ళాల్సిన అవినాష్ సేవ్ అవ్వడంతో పృథ్వీరాజ్ని బలిచేశారు బిగ్ బాస్ టీమ్. అయితే బిగ్ బాస్ వల్ల అన్యాయం జరిగినా.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం న్యాయం జరిగిందని సమాచారం. సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ నటుడు వారానికి 2.5 లక్షలు అందుకున్నాడట.
Bigg Boss prithviraj shetty
ఈలెక్కన 13 వారాలకు 32 రెండు లక్షల వరకూ పృథ్వీరాజ్ రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రైజ్ మనీకి దాదాపు దగ్గర గా రెమ్యునరేషన్ అందుకున్నాడు కన్నడ నటుడు. రెమ్యునరేషన్ విషయంలో ఎంత తీసుకున్నాడు అనే విషయంల క్లారిటీ లేదు కాని.. ఎలిమినేషన్ విషయంలో పృధ్వీరాజ్ కు అన్యాయం జరిగింది అనేది మాత్రం నిజం. ఈ విషయంలో ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.