సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది. మహేష్ బాబు గతంలో ఛాలెంజింగ్ అనిపించే చిత్రాలు చాలా చేశారు. టక్కరి దొంగ, నిజం లాంటి చిత్రాలు ఛాలెంజింగ్ రోల్స్ అని చెప్పొచ్చు. మహేష్ నటనతో అదరగొట్టినప్పటికీ ఆ చిత్రాలతో నిరాశ తప్పలేదు.
అదే తరహాలో మహేష్ బాబుకి మరో డిజాస్టర్ తప్పింది. సుకుమార్ ఆర్య లాంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబుని డైరెక్ట్ చేయాల్సింది. మహేష్ బాబు కోసం జగడం కథ రాసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయా తర్వాత అల్లు అర్జున్ తో చేద్దాం అనుకున్నారు. ఇద్దరితో కుదరకపోయేసరికి రామ్ పోతినేనితో ఆ చిత్రం రూపొందించారు.
జగడం వైవిధ్యమైన కథ. కానీ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ విధంగా మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు. కానీ రెండోసారి దొరికిపోయాడు. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం ఎంత పెద్ద ఫ్లాపో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ తర్వాత ఫ్యాన్స్ ఆ చిత్రానికి కల్ట్ మూవీ స్టేటస్ ఇచ్చేశారు.
ఒకే దర్శకుడి చేతిలో రెండు ఫ్లాప్ చిత్రాలు మూటగట్టుకున్న హీరోల జాబితాలో ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ఉన్నారు. మహేష్ ఒక్క సినిమా నుంచి అయినా తప్పించుకున్నాడు కానీ.. ఎన్టీఆర్, ప్రభాస్ మాత్రం రెండుసార్లు ఒకే దర్శకుడికి దొరికిపోయారు. ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో మొదట కంత్రి చిత్రం వచ్చింది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మరోసారి మెహర్ కి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఇంకా పెద్ద ఫ్లాప్.. అదే శక్తి చిత్రం. ఈ చిత్రంతో నిర్మాత అశ్విని దత్ బాగా నష్టపోయారు.
ఇక ప్రభాస్ బుజ్జిగాడు చిత్రంతో పూరి జగన్నాధ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ నిరాశపరిచినప్పటికీ వెంటనే ఏ నిరంజన్ చిత్రానికి కూడా పూరికి ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా ఫ్లాప్ అయింది.