BiggBoss7:అమర్ దీప్ భార్యని టార్గెట్ చేసిన శివాజీ ఫ్యాన్స్..డిఫెన్స్ బాగా ఆడింది, కానీ క్లీన్ బౌల్డ్

First Published | Dec 11, 2023, 11:12 AM IST

అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ తెరవెనుక ఉంటూ అమర్ దీప్ పై సింపతీ పెరిగేలా క్యాంపైన్ చేస్తున్నట్లు టాక్. ఆమె సోషల్ మీడియాలో తన భర్తకి మద్దతుగా పోస్ట్ లు పెడుతోంది. తాజాగా తేజస్విని గౌడ చేసిన ఒక పోస్ట్ విషయంలో శివాజీ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 7లో ఇక మిగిలింది ఒక్క వారమే. ఫైనలిస్టులు కూడా ఖరారయ్యారు. అర్జున్ రెడ్డి, అమర్ దీప్, ప్రియాంక, యావర్, ప్రశాంత్, శివాజీ ఫైనలిస్టులుగా నిలిచారు. అత్యంత ఉత్కంఠ మధ్య శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 7లో గ్లామర్ అట్రాక్షన్ గా నిలిచిన శోభా శెట్టి ఫైనలిస్ట్ గా అర్హత సాధించడంలో అడుగు దూరంలో నిలిచిపోయింది. 

ఇక ఫైనల్ కి చేరిన వారిలో శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య టైటిల్ ఫైట్ ఉండబోతున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గరు ఓటింగ్ లో ముందు వరుసలో ఉన్నారట. సోషల్ మీడియాలో కూడా ఈ ముగ్గురికి అదే స్థాయిలో మద్దతు లభిస్తోంది. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ పల్లవి ప్రశాంత్ కి వర్క్ అవుతోంది. ఇక శివాజీకి సినీ గ్లామర్ తో పాటు,ఆయన ఫాన్స్ జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 


ఇక అమర్ దీప్ కి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. టివి సెలెబ్రిటీలు చాలా మంది అమర్ దీప్ కి సపోర్ట్ గా పోస్ట్ లు చేస్తున్నారు. అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ తెరవెనుక ఉంటూ అమర్ దీప్ పై సింపతీ పెరిగేలా క్యాంపైన్ చేస్తున్నట్లు టాక్. ఆమె సోషల్ మీడియాలో తన భర్తకి మద్దతుగా పోస్ట్ లు పెడుతోంది. 

తాజాగా తేజస్విని గౌడ చేసిన ఒక పోస్ట్ విషయంలో శివాజీ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేస్తున్నారు. హౌస్ లో అమర్ దీప్ మధ్యాహ్నం రోటీలని, నైట్ రోటీలని ఎవరికీ తెలియకుండా (ప్రియాంకకి మాత్రమే తెలుసు) మిక్స్ చేసేసిన సంఘటన తీవ్ర వివాదంగా మారింది. ఈ విషయంలో నాగార్జున అమర్ కి క్లాస్ పీకారు. 

దీనిపై అమర్ దీప్ భార్య తేజస్విని సుదీర్ఘ వివరణ ఇస్తూ పోస్ట్ చేసింది. 'ఫుడ్ విషయంలో అమర్ ఆ విధంగా చేయడం కరెక్టా అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. అమర్ ఫుడ్ విషయంలో ఎప్పుడూ అలా చేసే వ్యక్తి కాదు.. ఇంకా పది మందికి ఫుడ్ పెట్టాలనే చూస్తాడు. ఈ సంఘటన జరిగినప్పుడు నన్ను రెస్పాన్స్ అడిగారు. కానీ నేను స్టాండ్ తీసుకోలేదు. 

Also Read: రీసెంట్ గా పెళ్లి.. భర్తతో పాటు రెండు రోజులు చెన్నై వరదలో చిక్కుకుపోయిన నటి, చివరికి ఏం జరిగిందంటే

అక్కడ ఏం జరిగిందో అమర్ ఎందుకు అలా చేశాడో తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకే సైలెంట్ గా ఉన్నా. నాకు అమర్ గురించి తెలుసు. అమర్ అలాంటి తప్పు చేయడు. కానీ సిట్యువేషన్ తెలియకుండా డిఫెన్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు అందరికి అర్థం అయి ఉంటుంది అమర్ ఎందుకు అలా చేశాడో అని (ఫుడ్ వేస్ట్ కాకూడదు అని). విషయం పూర్తిగా తెలియకుండా ఒక వక్తిపై నిందలు వేయడం కరెక్ట్ కాదు అంటూ తేజస్విని గౌడ పోస్ట్ చేసింది. 

Also Read: అమర్ దీప్ ఫేక్ కాదు, చాలా జెన్యూన్ పర్సన్.. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి, మద్దతు తెలిపిన సోహైల్

దీనితో శివాజీ ఫ్యాన్స్ తేజస్విని పోస్ట్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అమర్ దీప్ భార్య గ్రేట్ డిఫెన్స్ ఆడింది. కానీ క్లీన్ బౌల్డ్ అయింది అంటూ సెటైర్స్ వేస్తున్నారు. అమర్ దీప్ క ఓట్ వేసి వేస్ట్. శివాజీనే బిగ్ బాస్ విజేత అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Latest Videos

click me!