కనకదుర్గమ్మ ని దర్శించుకున్న వెంకటేష్‌.. శ్రద్ధా శ్రీనాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు..

Published : Dec 11, 2023, 10:26 AM IST

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న `సైంథవ్‌` టీమ్‌ విజయవాడ కనకదుర్గ టెంపుల్‌ని సందర్శించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వారంతా ఈ ఉదయాన్ని కనకదుర్గమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

PREV
15
కనకదుర్గమ్మ ని దర్శించుకున్న వెంకటేష్‌.. శ్రద్ధా శ్రీనాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు..

విక్టరీ వెంకటేష్‌.. టాలీవుడ్‌ ఆడియెన్స్ ముద్దుగా పిలుచుకునే వెంకీ మామ.. ప్రస్తుతం `సైంథవ్‌` సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రానుంది. అయితే చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ వచ్చింది. అలాగే మొదటి పాట కూడా వచ్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేస్తున్నారు. విజయవాడలో ఈ మేరకు  ఈ రోజు ఉదయం ఈవెంట్‌ నిర్వహించారు. 
 

25

ఈవెంట్‌కి వెళ్లిన `సైంథవ్‌` టీమ్‌ విజయవాడ కనకదుర్గ టెంపుల్‌ని సందర్శించుకున్నారు. కనకదుర్గమ్మకి టీమ్‌తో కలిసి వెంకటేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. 

35

ఈ కార్యక్రమంలో వెంకటేష్‌తోపాటు హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్‌, బాలనటి, దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాతలు పాల్గొన్నారు. వీరంతా కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని సినిమా ఈవెంట్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. 

45

వెంకటేష్‌కి సాధారణంగా ఆథ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఆయన ఖాళీగా ఉంటే ఆయా విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. తన లైఫ్‌ కూడా అలానే ఉండాలనుకుంటారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న `సైంథవ్‌` మూవీ సంక్రాంతికి రాబోతుంది. దీనికి శైలేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీకి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తుంది. వీరితోపాటు ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రుహానీ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

55

చాలా గ్యాప్‌ తర్వాత వెంకటేష్‌ నుంచి వస్తోన్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. కూతురు సెంటిమెంట్ ఇందులో ప్రధానంగా ఉండబోతుందట. అదే కథని మలుపు తిప్పుతుందని తెలుస్తుంది. ఈ నెల 22న విడుదల కావాల్సిన ఈ మూవీ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories