`మహావతార్‌ నరసింహ` కలెక్షన్ల సునామీ.. ఎవరు చూస్తారులే అన్నారు, ఇప్పుడు బాక్సాఫీసు షేక్‌, 16రోజుల వసూళ్లు

Published : Aug 10, 2025, 06:31 PM IST

`మహావతార్‌ నరసింహ` మూవీ బాక్సాఫీసు వద్ద గర్జిస్తోంది. విడుదలై 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 

PREV
15
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న `మహావతార్‌ నరసింహ`

యానిమేషన్‌ మూవీ ఇప్పుడు ఇండియన్‌ సినిమా బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది. అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. కేవలం కోటిన్నరతో ప్రారంభమైన ఈ మూవీ కలెక్షన్లు ఇప్పుడు రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. కంటెంట్‌ ఉంటే స్టార్స్ తో పనిలేదని నిరూపించిన మూవీ ఇది. అంతేకాదు ఇండియాలోనే మొదటిసారి వచ్చిన బెస్ట్ యానిమేషన్‌ మూవీ `మహావతార్‌ నరసింహ` కావడం విశేషం.

DID YOU KNOW ?
తొలి రోజు కలెక్షన్లు
`మహావతార్‌ నరసింహ` మూవీ మొదటి రోజు కేవలం కోటిన్నర మాత్రమే వసూళు చేసింది.
25
రూ.15కోట్ల బడ్జెట్‌తో రూపొందిన యానిమేషన్ మూవీ

కన్నడలో రూపొందిన `మహావతార్‌ నరసింహ` మూవీకి అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. సుమారు రూ.15కోట్లతో ఈ యానిమేషన్‌ మూవీని రూపొందించారు. ఈ సినిమా తీసేటప్పుడు ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారట. ఈ మూవీని ఇప్పుడు ఎవరు చూస్తారు. దేవుడి సినిమాని ఎవరూ చూడరు అని నిరాశ పరిచారట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని తెలిపారు. కానీ తన వద్ద ఉన్నదంతా పెట్టి ఈ సినిమాని రూపొందించారు అశ్విన్‌ కుమార్‌. తన క్లీమ్‌ ప్రొడక్షన్స్ కి హోంబలే ఫిల్మ్స్ వాళ్లు తోడయ్యారు. కంటెంట్‌ని చూసి వాళ్లు ప్రోత్సహించారు. సమర్పకులుగా మారి విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద గర్జిస్తోంది.

35
`మహావతార్‌ నరసింహ` కలెక్షన్లు

`మహావతార్‌ నరసింహ` మూవీ జులై 25న విడుదలైంది. కన్నడతోపాటు తెలుగులో విడుదల చేశారు. అప్పుడు ఈ సినిమా ఒకటుందని, రిలీజ్‌ అవుతుందని కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ తొలి రోజు కేవలం కోటిన్నర మాత్రమే సాధించింది. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ రావడంతో నెమ్మదిగా పుంజుకుంది. రోజుకి కోటిన్నర నుంచి రోజుకి నాలుగు కోట్లు, ఐదు కోట్లు, ఏడు కోట్లు, పది కోట్లకు పెరుగుతూ, ఇప్పుడు 16 రోజులు పూర్తి చేసుకుంది. ఏకంగా రూ.175కోట్లు రాబట్టింది. ఈ వీకెండ్స్ లో దుమ్ములేపుతుంది. మేకర్స్ కి షాకిస్తూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటం విశేషం.

45
రెండు వందల కోట్ల దిశగా `మహావతార్‌ నరసింహ`

సాధారణంగా ఇప్పుడు సినిమాలు వీకెండ్‌లో ఆడితే గొప్ప. మొదటి వారం నిలబడితే గ్రేట్‌. బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందంటే బ్లాక్‌ బస్టర్‌ కౌంట్‌లోకి వెళ్తుంది. కానీ `మహావతార్‌` మూవీ మూడు వారాల్లోనూ దుమ్మురేపుతుంది. ఇంకా రోజు వారి కలెక్షన్లు పెరుగుతుండటం విశేషం. పెట్టిన బడ్జెట్‌కి 12 రెట్లు కలెక్షన్లని సాధించడం మరో విశేషం. ఇప్పటికీ ఈ సినిమా జోరు తగ్గడం లేదు. దీనికి అంతే లేదనేలా రన్‌ అవుతుంది. ఈజీగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతకు మించి వసూళ్లని రాబట్టినా ఆశ్చర్యం లేదు. అశ్విన్‌ కుమార్‌ నమ్మకం ఇప్పుడు ఈ మూవీ సంచలనాలకు కారణమయ్యిందని చెప్పొచ్చు.

55
`మహావతార్‌` సిరీస్‌లో ఏడు సినిమాలు

`మహావతార్‌` సినిమాలను ఒక సిరీస్‌గా తీసుకురాబోతున్నారు. సుమారు 12ఏళ్లపాటు కంటిన్యూగా ఈ చిత్రాలను విడుదల చేస్తున్నారు. విష్ణువు అవతారాలను ప్రధానంగా చేసుకుని `మహావతార్‌` సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు నరసింహ అవతారం ప్రధానంగా `మహావతార్‌ నరసింహ` రూపొందగా,  2027లో `మహావతార్‌ పరశురామ్‌`, 2029లో `మహావతార్‌ రాఘనందన`, 2031లో `మహావతార్‌ ద్వారకాధిష్‌`, 2033లో `మహావతార్‌ గోకులనంద`, 2035,37 `మహావతార్‌ కల్కి` రెండు పార్ట్ లు రానున్నాయి. మొదటి పార్టే ఈ రేంజ్‌లో ఆడితే, ఇక మిగిలిన పార్ట్ లు ఏ రేంజ్‌లో సంచలనాలు క్రియేట్‌ చేస్తాయో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories