ఇదిలా ఉంటే ఈ సారి 15 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నారట. వీరిలో 9 మంది రెగ్యూలర్ సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఉంటారు. ఆరుగురు కామనర్స్ ఉంటారని సమాచారం. వాళ్లెవరనేది ఇప్పటికే పేర్లు వినిపించాయి. ఇమ్మాన్యుయెల్, తనూజా గౌడ, ఆషా సైనీ, భరణి, సంజనా గాల్రానీ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి వంటి వారు కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. మరోవైపు వీరితోపాటు కామనర్స్ నుంచి మనీష్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా, హరీష్ హౌజ్‌లోకి రాబోతున్నారట. వీళ్లు ఫైనల్ కంటెస్టెంట్లు అని తెలుస్తోంది.