నెక్స్ట్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్ నిఖిల్ తల్లి. రాగానే తన కొడుకుని ఆమె ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ఆమె కూడా ఇంటి సభ్యులతో ముచ్చటించింది. నిఖిల్ ఇంటి సభ్యులని తన తల్లికి పరిచయం చేస్తుండగా.. వీళ్లంతా నాకు తెలుసు అంటూ అవినాష్, తేజ, విష్ణుప్రియ అందరి పేర్లు చెప్పారు. ఆమె తన కొడుకుతో ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ గేమ్ ఆడవద్దు. నీ గేమ్ నువ్వు ఆడు. Y ని కంట్రోల్ చేయి అంటూ ఆమె నిఖిల్ కో కోడ్ వర్డ్ లో చెప్పింది. Y అంటే యష్మి నే భావించాలి. నిఖిల్, యష్మి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి నిఖిల్ తల్లి అలా హెచ్చరించింది. నువ్వు టైటిల్ గెలుస్తావని మేమంతా ఇంట్లో ఎదురుచూస్తున్నాము అని తెలిపింది.