అమరన్: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్

First Published | Nov 13, 2024, 8:14 PM IST

'అమరన్' చిత్రం ఓటీటీ విడుదల తేదీని వాయిదా వేయాలని థియేటర్ యజమానుల సంఘం.. కమల్ హాసన్, శివకార్తికేయన్, రెడ్ జెయింట్ మూవీస్ ని విజ్ఞప్తి చేసింది.

అమరన్ సినిమా

దీపావళికి కానుకగా విడుదలైన 'అమరన్' మూవీ వసూళ్లు పరంపర కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమాకి  విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని థియేటర్ యజమానుల సంఘం నిర్మాతలను కోరింది.

అమరన్ సినిమా 250 కోట్లు వసూలు

ఈ మేరకు నిర్మాత కమల్ హాసన్, తమిళనాడు విడుదల హక్కులు సొంతం చేసుకున్న రెడ్ జెయింట్ మూవీస్, నటుడు శివకార్తికేయన్ లకు విజ్ఞప్తి చేశారు. థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, 'అమరన్'కి మంచి ఆదరణ లభిస్తున్నందున ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని కోరారు.

తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. పన్నీర్ సెల్వం ఒక ప్రకటన విడుదల చేస్తూ, 'అమరన్' అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నందున ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలో అమరన్ ఓటీటీలో ఆలస్యంగా అందుబాటులోకి రానుంది. 


అమరన్ సినిమా

అమరన్ డిజిటల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ రూ. 60 కోట్లు చెల్లించి అమరన్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. అమరన్ మూవీ శివ కార్తికేయన్ మార్కెట్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. 
 

అమరన్ ఓటీటీ వాయిదా

'అమరన్' భారీ సక్సెస్ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్, శివకార్తికేయన్ సహా చిత్ర బృందానికి తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. పన్నీర్ సెల్వం అభినందనలు తెలిపారు. మంచి కథా నేపథ్యం ఉన్న సినిమాలు ప్రేక్షకులను కుటుంబ సమేతంగా థియేటర్లకు రప్పిస్తాయని 'అమరన్' విజయమే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

అమరన్ ఓటీటీ విడుదల

అమరన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. శివ కార్తికేయన్ కి జంటగా సాయి పల్లవి నటించింది. సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి. భువన్ అరోరా, రాహుల్ బోస్ ఇతర కీలక రోల్స్ చేశారు. అమరన్ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అక్టోబర్ 31న అమరన్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి.  

Latest Videos

click me!