రాత్రి వేళ అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించాడు..టేస్టీ తేజ మంచి ఫుడ్డీ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి

First Published | Oct 6, 2024, 8:37 PM IST

టేస్టీ తేజ ప్రముఖ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ లో ఫుడ్ వీడియోలు చేస్తూ తేజ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. టేస్టీ తేజ క్రేజ్ ని బిగ్ బాస్ ఇంకా పెంచింది. టేస్టీ తేజ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. 63 రోజులు తేజ హౌస్ లో గడిపాడు. ఇప్పుడు టేస్టీ తేజకి సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా మరోసారి ఛాన్స్ వచ్చింది.

టేస్టీ తేజ ప్రముఖ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ లో ఫుడ్ వీడియోలు చేస్తూ తేజ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. టేస్టీ తేజ క్రేజ్ ని బిగ్ బాస్ ఇంకా పెంచింది. టేస్టీ తేజ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. 63 రోజులు తేజ హౌస్ లో గడిపాడు. ఇప్పుడు టేస్టీ తేజకి సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా మరోసారి ఛాన్స్ వచ్చింది. ఈసారి కప్పు సాధించాలనే లక్ష్యంతోనే తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

బిగ్ బాస్ సీజన్ 7 కి ముందు తేజ వేరు ఇప్పుడు తేజ వేరు. అంతకు ముందు నార్మల్ యూట్యూబర్ గా తేజ వీడియోలు చేసేవాడు. ఇప్పుడు తేజ వీడియోలకు సెలెబ్రిటీలు కూడా అతిథులుగా హాజరవుతున్నారు. నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్, కాజల్, శ్రీవిష్ణు లాంటి సెలెబ్రిటీలు టేస్టీ తేజతో వీడియోలు చేశారు. బిగ్ బాస్ 7 తర్వాత తేజని రెస్టారెంట్ ఓపెనింగ్స్ కి కూడా ఆహ్వానిస్తున్నారు. సొంతంగా తేజ ఫుడ్ బిజినెస్ కూడా ప్రారంభించారు. 


టేస్టీ తేజ బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడి గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. తేజ మంచి ఫుడ్డీ అనే సంగతి తెలిసిందే. అంతకి మించి మంచి మనసున్న వ్యక్తి. దీనికి ఓ సంఘటన ఉదాహరణ. ఒకసారి తేజ తన బైక్ లో హైదరాబాద్ లో కేపిహెచ్ బి ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో వెళుతున్నాడట. మూత్ర విసర్జన కోసం బైక్ ఆపి రోడ్డు పక్కకి వెళ్ళాడట. అక్కడ చీకట్లో ఒక అమ్మాయి ఏడుస్తోంది. ముగ్గురు యువకులు ఆమె వద్ద ఉన్నారు. 

అమ్మాయి ఏదో ప్రాబ్లెమ్ లో ఉంది అని అర్థం అయింది. వెంటనే తన బైక్ దగ్గరికి వెళ్లి బైక్ లైట్ అమ్మాయిపై వేసి తెలిసిన అమ్మాయి లాగా పిలుద్దామని అనుకున్నాడట. పిలిచిన వెంటనే వస్తే ఆమె కష్టాల్లో ఉంది అని అర్థం. మీరు ఎవరో తెలియదు అని అంటే వెళ్ళిపోదాం అనుకున్నాడట. వెంటనే లైట్ వేసి ఏంటి ఇక్కడ ఉన్నావు.. నేను నీకోసం చాలా సేపటి నుంచి ఎదురుచూస్తున్నా అని చెప్పాడు. వెంటనే ఆమె తేజ పక్కకి వచ్చి నిలబడిందట. ఆమ్మో ఈమె నిజంగానే ప్రాబ్లెమ్ లో ఉంది అని అర్థం అయింది. 

ఎవడ్రా నువ్వు అంటూ వాళ్ళు నా మీదకి వచ్చారు. వాళ్ళ చేతుల్లో కత్తి కూడా చూశాను. ఎవరన్నా మీరు అని మర్యాద పూర్వకంగా అడిగాను. అయినా వాళ్ళు నన్ను బైక్ మీది నుంచి తోసేశారు. వెంటనే నేను తెలివిగా బైక్ హార్న్ కొట్టాను. వాళ్ళు భయంతో పారిపోయారు. వెళుతూ వెళుతూ ఆ అమ్మాయి మెడలో చైన్ లాక్కుని పారిపోయారు. ఏం జరిగింది అని ఆ అమ్మాయిని అడిగితే అసలు విషయం చెప్పింది. నేను బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాను. ఎస్ఆర్ నగర్ లో హాస్టల్ లో ఉంటున్నా. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే కలుద్దామని వచ్చా. వచ్చే దారిలో వీళ్ళు ఇలా అడ్డుకున్నారు అని చెప్పింది. సరే ఎక్కు మీ ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పా. 

ఇప్పుడు వద్దులే అన్నా.. ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారేమో.. నన్ను హాస్టల్ లో డ్రాప్ చేయండి అని అడిగింది. ఎస్ ఆర్ నగర్ తీసుకుని వెళ్లి హాస్టల్ లో డ్రాప్ చేశా. అక్కడ ఆ అమ్మాయి తనని సేవ్ చేసినందుకు తేజ కాళ్ళు పట్టుకుని థ్యాంక్స్ చెప్పిందట. కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ వార్తని మరో రకంగా రాశారు. దుండగులు కొట్టడం వల్ల టేస్టీ తేజ కోమాలోకి వెళ్ళాడు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు అని తేజ బాధపడ్డాడు. ఆ విధంగా అమ్మాయిని రక్షించి రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడు తేజ. ఇప్పుడు తేజ మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో ఆసక్తి నెలకొంది. 

Latest Videos

click me!