అయితే హౌజ్‌లో నిఖిల్, విష్ణుప్రియా మాత్రం స్పెషల్‌గా నిలుస్తున్నారు. వీరికి ఒక్కో రోజుకి యాభై వేలవరకు పారితోషికం తీసుకుంటున్నారట. విష్ణు ప్రియా గత సీజన్‌లోనే బిగ్ బాస్ కి రావాలని నిర్వాహకులు అడిగారు. తనకు రోజుకి 70వేలు ఇస్తే వస్తా అని చెప్పింది. దీంతో సైలైంట్ అయ్యారు. ఈ సారి మరోసారి ఆమెని అప్రోచ్ అయ్యారని, అయితే ఈ సారి దిగొచ్చిందట. తనకు పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఎంతో కొంతకి ఓకే చెప్పిందట. ఈ క్రమంలో ఆమెకి రోజుకి 45-50వేల వరకు పారితోషికం ఇస్తున్నారట.
అలాగే నిఖిల్ పారితోషికం కూడా నాలభై వేలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. సీరియల్ నటుడిగా నిఖిల్‌కి మంచి క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ఇది. ఇందులో నిజమెంతా అనేది వాళ్లు తెలియజేస్తేనే తెలుస్తుంది. సెప్టెంబర్ 1న 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇంట్లోనేమో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అరాధిస్తాడు.. ఆయన రిక్వెస్ట్ చేస్తే మొహంమీదే నో చెప్పిన హీరో ఎవరో తెలుసా?