ఏసియానెట్ చేతిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మంది వివరాలు ఇవిగో

Published : Sep 01, 2024, 06:13 PM ISTUpdated : Sep 01, 2024, 06:16 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్ల వివారాలు ఇక్కడ ఉన్నాయి.

PREV
115
ఏసియానెట్ చేతిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మంది వివరాలు ఇవిగో
Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్ల వివారాలు ఇక్కడ ఉన్నాయి. ఈసారి షోలో ఎక్కువ మంది సోషల్ మీడియా పర్సన్స్, బుల్లితెర నటీనటులకు ప్రాధానత్య ఇచ్చారు. 14 మంది కంటెస్టెంట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. 

215

 హీరో ఆదిత్య ఓం : ఆదిత్య ఓం గురించి పరిచయం అక్కర్లేదు. లాహిరి లాహిరి లాహిరిలో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో ఈ యువ నటుడు హీరోగా నటించారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. 

 

315

డ్యాన్సర్ నైనిక : ఢీ షో ద్వారా తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో నైనిక మంచి క్రేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ 8 ఆమె క్రేజ్ ని ఇంకెంత పెంచుతుందో చూడాలి. 

 

415

కమెడియన్ అభయ్ : విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో అభయ్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు.  డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో కూడా నటించాడు. 

515

యాష్మి గౌడ : బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకుంది యాష్మి. కన్నడలో టీవీ సీరియల్స్ చేస్తోంది. తెలుగులో ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నటించింది.   

615

నబీల్ ఆఫ్రిది : ఇతడు సోషల్ మీడియా పర్సన్. యూట్యూబర్ గా పాపులారిటీ సాధించాడు. యూట్యూబ్ లో నబీల్ దెస విదేశాల్లో పర్యటించే వీడియోలు వైరల్ అవుతుంటాయి.  

715

సీత : ఈమె యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలతో పాపులర్ అయింది. అంతా ఆమెని కిరాక్ సీత అని పిలుస్తారు. బుల్లితెర షోలలో కూడా సీత ఇటీవల కనిపిస్తోంది. 

815

ప్రేరణ : ఈమె కూడా బుల్లితెర నటిగానే గుర్తింపు పొందింది. ప్రేరణ కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నటించింది. బిగ్ బాస్ ద్వారా తన పాపులారిటీ పెంచుకోవాలని చూస్తోంది.   

915

బేబక్క : ఈమె యూట్యూబ్ లో బెజవాడ బెబక్కగా పాపులర్ అయింది. మరి బిగ్ బాస్ షోలో ఎలా రాణిస్తుందో చూడాలి. బిగ్ బాస్ 8 లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది మరింత మంది అభిమానులని సొంతం చేసుకోవాలని బేబక్క చూస్తోంది.    

1015

నాగ మణికంఠ : నాగ మణికంఠ సోషల్ మీడియా పర్సన్ గా, బుల్లితెర నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. బిగ్ బాస్ 8 లో ఇతడికి వచ్చిన ఛాన్స్ కెరీర్ కి ప్లస్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. 

1115

విష్ణుప్రియ  : విష్ణు ప్రియ యాంకర్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో చూశాం. అదే విధంగా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కూడా పాపులర్ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.   

1215

నిఖిల్ : నటుడు నిఖిల్ అనేక టివి సీరియల్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. అమ్మకు తెలియని కోయిలమ్మ అనే టివి షోలో నిఖిల్ నటించాడు.   

1315

శేఖర్ భాష : ప్రముఖ ఆర్జేగా శేఖర్ భాష గుర్తింపు పొందాడు. ఇటీవల రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది ఇతడే.   

1415

సోనియా ఆకుల :యంగ్ బ్యూటీ సోనియా ఆకుల నటిగా రాణిస్తోంది. జార్జి రెడ్డి, కరోనా వైరస్, ఆశ ఎన్కౌంటర్ చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ 8లో సత్తా చాటేందుకు సిద్ధం అయింది. 

 

1515

పృథ్వీరాజ్ : జీ తెలుగు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు పృథ్వి రాజ్.. దొరసారి సీరియల్ తో పాపులర్ సాధించాడు... మా వారు మాస్టారు సీరియల్ కూడా చేస్తున్నాడు. ఈ యువ నటుడికి బిగ్ బాస్ 8 అవకాశం వచ్చింది. 

Read more Photos on
click me!

Recommended Stories