Asianet Telugu exclusive : బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ వీళ్ళే

First Published | Sep 1, 2024, 1:38 PM IST

తాజాగా బిగ్ బాస్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ మొత్తం లిస్ట్ బయటకి వచ్చేసింది. మొత్తం 14 మంది ఈ షోలో పాల్గొనబోతున్నారు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 షో కి సంబంధించిన Asianet Telug Exclusive Update ఇది. ఈసారి సీజన్ గురించి చాలా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ముందుగా ప్రేక్షకులు కంటెస్టెంట్స్ మొత్తం ఎవరు అని ఆరా తీస్తున్నారు.  ఇప్పటికే కొన్ని పేర్లు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. 

Bigg Boss telugu season 8

అయితే తాజాగా బిగ్ బాస్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ మొత్తం లిస్ట్ ఏసియానెట్ సంపాదించింది. మొత్తం 14 మంది ఈ షోలో పాల్గొనబోతున్నారు. వీరిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన సెలెబ్రిటీలు కొందరు ఉన్నారు. మరికొందరు బుల్లితెరపై పాపులర్ అవుతున్నారు. ఇంకొందరేమో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. 


Bigg boss telugu 8

ఒకసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ చూద్దాం. 

1. అఫ్రిది 

2. యాష్మి గౌడ 

3. కమెడియన్ అభయ్ 

4. డ్యాన్సర్ నైనిక

5. హీరో ఆదిత్య ఓం 

6. విష్ణుప్రియ 

7. పృథ్వీరాజ్ 

8. మణికంఠ 

9. సోనియా 

10. సీత 

11. శేఖర్ భాష 

12. బేబక్క 

13. నిఖిల్ 

14. ప్రేరణ 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్ళే. వైల్డ్ కార్డు ద్వారా ఒకరిద్దరిని సీజన్ మధ్యలో తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది ప్రతి సీజన్ లో చూస్తూనే ఉన్నాం. విష్ణు ప్రియ, ఓం ఆదిత్య, అభయ్ లాంటి వాళ్ళు ఆడియన్స్ కి బాగా తెలిసిన కంటెస్టెంట్స్. 

Bigg boss telugu 8

అయితే బిగ్ బాస్ సీజన్ 8 లో లాంచ్ ఎపిసోడ్ లో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా హౌస్ లోకి పంపించడం చూశాం. కానీ ఈ సీజన్ లో జంటలు జంటలుగా హౌస్ లోకి పంపిస్తారట. అందుకు తగ్గట్లుగానే 7గురు మేల్ కంటెస్టెంట్స్.. 7గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. 

మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రతి వారం హౌస్ లోకి గత సీజన్ లోని మాజీ కంటెస్టెంట్ వెళ్లి హౌస్ మేట్స్ తో సరదాగా గడుపుతారట, షోని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Latest Videos

click me!