సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. శివాజీ, శోభా శెట్టి, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో షో మొత్తం మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధించింది. అంతకి మించేలా సీజన్ 8లో వినోదం ఉండాలనే ప్లాన్ తో నిర్వాహకులు షోని ముందుకు తీసుకువస్తున్నారు.
కమెడియన్ అభయ్ నవీన్, హీరో ఆదిత్య ఓం, విష్ణుప్రియ, మణికంఠ, న్యూస్ రీడర్ కళ్యాణి, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, యాష్మి గౌడ లాంటి వాళ్ళు కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.