2022 ఏడాదికిగానూ జాతీయ అవార్డులను ఆగస్ట్ నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. `తిరుచిత్రంబలం` మూవీకిగానూ జానీ మాస్టర్‌కి, అలాగే సతీష్ మాస్టర్‌లకు కలిపి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డుని ప్రకటించారు. ఈ అవార్డు ఫంక్షన్ ఈ నెల 8న ఢిల్లీలో జరగబోతుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జాతీయ అవార్డుని అందుకోనున్నారు విజేతలు.
దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. పోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది. ఇది చాలా సీరియస్ కేసుగా ప్రభుత్వం, కోర్ట్ భావిస్తుంది. ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు జాతీయ అవార్డు ప్రదానం చేయడం సరైనది కాదని ప్రభుత్వం భావించింది. అందుకే జాతీయ అవార్డుని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.